యాక్సిడెంట్: హీరో విక్రమ్ కొడుకు పరుగో పరుగు... వీడియో వైరల్!

By Bojja Kumar

Recommended Video

హీరో విక్రమ్ కొడుకు పరుగో పరుగు... వీడియో వైరల్!

ప్రముఖ సౌత్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు ఝామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతడి రాష్ డ్రవింగ్ కారణంగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆటోలు ఢీ కొట్టడంతో అతడి కారుతో పాటు ఆటోలు ధ్వంసం అయ్యాయి. ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ధృవ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెలుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కారు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని విచారించారు. అయితే ఈ సందర్భంగా ధృవ్ పోలీసులతో ప్రవర్తించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తనను వీడియో తీయవద్దు అంటూ బెదిరించాడు. ఆపై అక్కడి నుండి పరుగులు పెట్టాడు. పోలీసులు అతడి వెంట పడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే అతడిని బెయిల్ మీద విడుదల చేశారు. కొడుకు వ్యవహారంలో హీరో విక్రమ్ వెంటనే రంగంలోకి దిగి ఆగమేగాల మీద బెయిల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Car accident: Actor Vikram son Dhruv video viral

కాగా... ధృవ్ త్వరలో 'వర్మ' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్‌ రెడ్డి'కి ఇది తమిళ రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే ఈ కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X