మరో వివాదం : టైటిల్ మార్చాలంటూ కమీషనర్ కి పిర్యాదు

By Srikanya

చెన్నై : రిలీజ్ అవుతున్న లేదా కాబోతున్న ప్రతీ చిత్రం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటోంది. తాజాగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న తమిళ చిత్రం ఆదిభగవాన్ చిక్కుల్లో పడింది. ఇప్పటికే ముస్లిం సంఘాలు వ్యతిరేకత తెలపడంతో విశ్వరూపం చిత్రాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఆదిభగవాన్ చిత్రంలో హిందువులను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ సుప్రీం కోర్టు న్యాయవాదులు కృష్ణమూర్తి, దురై సెల్వన్ సోమవారం చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. న

హీరో జయం రవి నటించిన ఆది భగవాన్ చిత్ర దర్శకుడు అమీర్ అంతకు ముందు రామ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారని తెలిపారు. అందులో హీరోను సైకోగా చూపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆది భగవాన్ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొన్నారు. ఆది భగవాన్ అనే పేరు హిందువుల ఆరాధ్య దేవుళ్లు అయిన వినాయకుడు, శివుడికి వర్తిస్తుందని వెల్లడించారు.

ఈ చిత్రంలో హిందువుల దేవతలను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. ఆదిభగవాన్ చిత్రానికి సెన్సార్‌కు ముందుగా తమకు చూపించాలని కోరుతున్నామని తెలిపారు. అదే విధంగా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులు, హిందూ మత ప్రతినిధులకు చిత్రాన్ని చూపాలని, ఆదిభగవాన్ అనే టైటిల్‌ను మార్చాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X