twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్‌పై ఐటీ రైడ్స్.. అరెస్ట్ వరకు వెళ్తుందా?.. ముదురుతున్న వ్యవహారం

    |

    బిగిల్ సినిమా నిర్మాతకు, డిస్బ్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్లు, హీరోకు ఎక్కడాలేని తంటాలు తెచ్చిపెట్టింది. గత మూడు రోజులుగా చెన్నైలో సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటం సంచలనంగా మారింది. రాను రాను ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇది కావాలనే చేస్తోన్న కుట్ర అంటూ రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

     కక్ష గట్టిన రాష్ట్ర ప్రభుత్వం..

    కక్ష గట్టిన రాష్ట్ర ప్రభుత్వం..

    విజయ్‌ నటించిన మెర్శల్‌ చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్‌టీ వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. అప్పుట్లో వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా బిగిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటుడు విజయ్‌ అన్నాడీఎంకే నాయకులకు వార్నింగ్‌ ఇచ్చే విధంగా మాట్లాడారు. తనను ఏమైనా అనండని, తన అభిమానులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

    అవకాశాన్ని వాడుకుంటోన్న ప్రతిపక్షాలు..

    అవకాశాన్ని వాడుకుంటోన్న ప్రతిపక్షాలు..

    ఇలా విజయ్‌పై ఐటీ రైడ్స్ వ్యవహారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు బాగానే వాడుకుంటున్నాయి. ఈ ఐటీ సోదాలకు బీజేపీ పార్టీనే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక దీంతో బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేక పార్టీల నాయకులకు అవకాశం దొరికినట్టైంది. ఈ వ్యవహారాన్ని కొందరు బాగానే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    ట్వీట్‌తో రచ్చ రచ్చ..

    ట్వీట్‌తో రచ్చ రచ్చ..

    సినిమా ఘన విజయం సాధించిందని ట్వీట్లు చేయడం, నిర్మాతలు గొప్పలు ప్రకటించుకోవడం అందరికీ తెలిసిందే. తీరా లెక్కలు చూస్తే మాత్రం పెద్ద బొక్కలు కనిపిస్తాయి. బిగిల్ విషయంలోనూ అదే జరిగింది. ఏజీఎస్‌ సంస్థ అధిపతి కల్పాత్తి అఘోరా చేసిన ప్రకటనలకు, చెప్పిన లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ కన్ను పడిందని, అదే ఇంత వరకు దారి తీసిందని టాక్.

    కేసులు నమోదయ్యే అవకాశం..

    కేసులు నమోదయ్యే అవకాశం..

    ఇకపోతే ఐటీ దాడులను ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే ప్రచారం సంచలనంగా మారింది. బిగిల్‌ చిత్రానికి ఫైనాన్స్‌ చేసిన ప్రముఖ ఫైనాన్సియర్‌ అన్భు చెలియన్‌ వద్ద బారీగా డబ్బు, డాక్యుమెంట్లు లభించాయి. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ కేసు నమోదు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా రెండు రోజుల పాటు ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొన్న నటుడు విజయ్‌ మాత్రం తనపై జరిగిన ఐటీ దాడుల గురించి స్పందించలేదు. శుక్రవారం ఆయన సైలెంట్‌గా తాను నటిస్తున్న మాస్టర్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు.

    English summary
    Enforce Dept WillPut Case Against Bigil Producers And Fianciars. 77 Crore Recovered From Financier Anbu In It Raids On Vijay. Now he is Busy With Lokesh Kangarajan Master movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X