For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటి భువనేశ్వరి ఇల్లు ఆక్రమించారు..పోలీస్ కేసు

  By Srikanya
  |

  చెన్నై :ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో భువనేశ్వరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన ఇంటిని ఆక్రమించారంటూ నటి భువనేశ్వరి ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి స్థానిక సాలిగ్రామంలో ఉన్నారు. ఈమె కోవై జిల్లా అన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఆ ఫిర్యాదులో ఏముందంటే... తనకు అన్నూర్ గ్రామంలో ఇల్లు, థియేటర్ ఉన్నాయన్నారు. వీటిని 2012లో అన్నూరుకు చెందిన వ్యాపారవేత్త సుబ్రమణియన్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే సుబ్రమణియన్ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి తన ఇల్లు, థియేటర్‌లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకుని తన ఇంటిని, థియేటర్‌ను తనకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సుబ్రమణియన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  Case against businessman for cheating actress Bhuvaneswari

  తమిళ, తెలుగు టీవీ ధారావాహికల్లో లేడి విలన్‌గా, సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో తన నటనా చాతుర్యాన్ని చాటుకున్న ఈ భువనేశ్వరి ఆ మధ్య వ్యభిచార నేరం కింద అరెస్టు అయ్యారు. ఈ కేసులో చిక్కుకున్న సమయంలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కోలివుడ్‌ను కుదిపేశాయి. కొందరు నటీమణుల గుట్టును రట్టు చేస్తూ చేసిన ఆరోపణలు చివరకు ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించాయి. తమిళ చిత్ర, ఛానళ్లకు కాస్త దూరంగా ఉంటున్న ఈమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ద్వారా మహిళా నేతగా రాజకీయ పయనం సాగిస్తున్న ఆమె జీవితం సినిమాను తలపించక మానలేదు అంటున్నారు.

  గతంలోనూ...

  శృంగార నటి భువనేశ్వరిపై చీటింగ్ కేసుతో పాటు వ్యభిచారం తదితర ఆరోపణలు ఉన్నాయి. భువనేశ్వరిని రూ. 1.5 కోట్ల చీటింగ్ కు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీవీ సీరియల్ నిర్మిస్తానని నమ్మబలికి ఆమె తన వద్ద రూ. 1.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని చెన్నై కెకె నగర్ కు చెందిన రఘునాథన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భువనేశ్వరిని విచారించారు. విచారణలో భువనేశ్వరి... తాను అమాయకురాలిని అని వెల్లడించింది. తనకు ఇచ్చింది కొంతే అని. తెల్లకాగితంపై తన సంతకం తీసుకుని ఎక్కువ ఇచ్చినట్లు రాసుకుని తనను మోసం చేసారని భువనేశ్వరి ప్రత్యారోపణలు చేసింది.

  Case against businessman for cheating actress Bhuvaneswari

  టీవీ సీరియళ్లల్లో లేడీ విలనిజంతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన నటి భువనేశ్వరి రియల్ లైఫ్‌లోనూ అదే బాటలో పయనించి ఇబ్బందుల్లో పడ్డా రు. పోలీసుల చేతికి చిక్కిన ఆమెపై ప్రస్తుతం ఫిర్యాదు లు, కేసుల మోత మోగుతోంది. దీంతో ఆమెపై గూండా చట్టం ప్రయోగించేందుకు నగర పోలీసు యంత్రాంగం కసరత్తుల్లో పడింది. ఈ కేసులన్నింటిని ఒక్కటిగా చేసి భువనేశ్వరిపై గుండా చట్టం ప్రయోగానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఆంబూరు, చెన్నై, ఈస్ట్ కోస్ట్ రోడ్డు స్టేషన్లలో నమోదైన కేసులతో పాటు ప్రస్తుతం వచ్చిన ఫిర్యాదులన్నింటి పరిశీలన పూర్తి కాగానే ఆమెపై ఈ చట్టాన్ని ప్రయోగించేందుకు నగర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

  ఈ చట్టం కింద అరెస్టయ్యే వారికి ఏడాది పాటు బెయిల్ లభించదు. ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం భువనేశ్వరిని సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెను మళ్లీ రిమాండ్‌కు తరలించారు. ఈ సమయంలో కోర్టు వద్ద ఆమె మీడియా వారిని కలిసి మాట్లాడింది.

  ఆమె మాటల్లో... "నా వెనకాల ఏదో కుట్ర జరుగుతోంది. నన్ను ఎవరో ఇరుకిస్తున్నారు. పక్కా ప్లానింగ్ ప్రకారం కుట్ర అమలు అవుతోంది. అందుకనే నా మీద ఇన్ని కేసులు ఒకేసారి పడ్డాయి. నేను బయిటకు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని,సత్యం నిరూపింపబడుతుందని నమ్ముతున్నా. ఈ సమయంలో ఇంతకన్నా ఏమీ మాట్లాడలేను. ఈ కేసులన్నిటినీ నేను లీగల్ గానే ఎదుర్కొంటాను." అంది.

  English summary
  The Annur police on Sunday filed a first information report in connection with a case filed by Tamil film actress P Bhuvaneswari in 2012 about a man cheating her of 32 cents of land worth Rs 3 crore. The police had then entered the complaint only in the Community Service Register and not filed an FIR. They explained the delay by claiming that prima facie evidence was found only now to file and FIR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X