రజనీకాంత్ వియ్యంకుడుపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
కేసు పూర్వాపరాలోకి వెళితే.. షావుకారుపేటకు చెందిన వడ్డీ వ్యాపారి ముకున్‌చంద్ బోత్రా వద్ద కస్తూరిరాజా ఈ ఏడాది జులైలో రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారు. పూచీకత్తుగా రూ. 40 లక్షలకు, రూ. 25 లక్షలకు రెండు చెక్కులతోపాటు వడ్డీ కింద ఒక 'బ్లాంక్ చెక్కు' ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ముకున్‌చంద్ బోత్రా ఈ నెల మొదట్లో రూ. 40 లక్షల చెక్కును బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించారు. అది బౌన్స్ కావడంతో కస్తూరిరాజాను సంప్రదించగా సరైన సమాధానం రాలేదు.
ఈ నెల 17న హార్బరు డిప్యూటీ కమిషనర్‌కు ముకున్‌చంద్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి... కస్తూరిరాజాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఇక గతంలోనూ కస్తూరి రాజా తెలుగు నిర్మాత నట్టికుమార్ తో వివాదమై కేసులో ఇరుక్కున్నారు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా '3' చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం తెలుగు హక్కులను పొందిన నట్టి కుమార్ నుంచి రాజా అనేక వివాదాలను, అభియోగాలను ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ చిత్రం రైట్స్ కొనుగోలు చేయటం వల్ల తానెంతో నష్టపోయానని, రాజా అందుకు పరిహారంచెల్లించాలని కోరారురు నిర్మాత నట్టి కుమార్. వీటిని తిప్పికొడుతూ, ఒప్పందం ప్రకారం ఆ చిత్రం రైట్స్‌ను తాను అమ్మానని, నట్టికుమార్ తనపై వెూపే అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టికుమార్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, దాంతో తానెంతో నష్టపోయానని కస్తూరి రాజా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












