twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : పార్వతీ మెల్టన్‌పై కేసు నమోదు

    By Srikanya
    |

    ఎమ్మిగనూరు : వెన్నెలతో పరియచమై, జల్సాతో పాపులరైన హీరోయిన్ పార్వతీ మెల్టన్‌పై ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. యమహోయమహః చిత్రంలో అశ్లీలంగా నటించారని.. ఆ పోస్టర్లను పట్టణంలో అతికించారని ఫిర్యాదు అందటంతో ఆమెపై కేసు నమోదు చేసి తాఖీదులు పంపనున్నారు. పార్వతీ మెల్టన్‌పై ఐపీసీ సెక్షన్లు 292, 34 కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

    మరో ప్రక్క హీరోయిన్లు అనుష్క, ప్రియమణిలు సినిమాల్లో అసభ్య వస్త్ర ధారణతో నటిస్తున్నారని, వారి మూలంగా సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని సుబద్ధి అనే వ్యక్తి మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ పిటీషన్‌పై మల్కాజ్ గిరి కోర్టు స్పందించింది.

    అనుష్క, ప్రియమణిలపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. మల్కాజ్ గిరి కోర్టు ఆదేశాల మేరకు ఈ ఇద్దరు హీరోయిన్లపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఇద్దరు హీరోయిన్లు నోటీసులు అందుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసుపై అనుష్క, ప్రియమణి ఎలా ప్రొసీడ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

    సినిమాల్లో వీరి వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉందని, ఒక రకంగా సమాజంలో మహిళలపై పురుషులు దాడులు చేయడాని పరోక్షంగా కారణం అవుతోందని పిటీషనర్ పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాల్లో వస్త్రదారణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.

    English summary
    A police case was filed on the actresses Parvathi Melton in the Police Station Emmiganur for wearing skimpy costumes in her film 'Yamoho Yamaha'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X