twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లింగా’ సినిమాపై రిట్ పిటీషన్ కొట్టి వేత....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘లింగా' చిత్రంపై దాఖలైన రిట్ పిటీషన్‌ను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టిపారేసింది. జస్టిస్ ఎం.వేణుగోపాల్ దీన్ని ప్రైవేటు వివాదంగా పేర్కొన్నారు. సివిల్ లేదా క్రమినల్ ప్రోసీడింగులో దీన్ని పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.

    తన స్టోరీని కాపీ కొట్టి ‘లింగా' చిత్రాన్ని తెరకెక్కించారంటూ కె.ఆర్. రవిరత్నం గత నెల ఈ రిట్ పిటీషన్ దాఖలు చేసారు. ‘ముల్లయ్ వానమ్ 999' సినిమా కోసం తాను రాసుకున్న స్టోరీలైన్‌ను యూట్యూబ్ నుండి కాపీ కొట్టారని ఆరోపించారు. అయితే లింగా టీం దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్లో....లింగా స్టోరీని ఎస్.పొన్నుకుమారన్ రచించారని, ఆయన 2010లోనే ‘కింగ్ ఖాన్' టైటిల్‌తో సౌతిండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేయించారని. రజనీకాంత్ ఫేమ్‌ను ఆసరాగా చేసుకుని ఆయన సినిమాలను అనవసర కాంట్రవర్సీల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

    Case against Rajinikanth starrer Lingaa dismissed

    విచారణ అనంతరం రిట్ పిటీషన్ కొట్టి వేయడంతో సినిమా విడుదలకు అడ్డంకి తొలగినట్లయింది.
    సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లింగ'. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, సోనాక్షిసిన్హా హీరోయిన్స్. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ ఈ మధ్యనే విడుదలైంది. అయితే అందరూ ఈ ట్రైలర్ తో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని, క్రేజ్ వస్తుందని భావించారు. కానీ ట్రేడ్ వర్గాల్లో చెప్పుకుంటున్నదాని ప్రకారం...ఈ చిత్రానికి తెలుగులో బిజినెస్ జరగటం లేదు. కేవలం సీడెడ్ ఏరియాకు సాయి కొర్రపాటి రైట్స్ తీసుకున్నారు. తెలంగాణాలో కానీ, ఆంధ్రాలో కానీ ఈ చిత్రం బిజినెస్ మిగతా ప్రాంతాల్లో జరగలేదని తెలుస్తోంది.

    English summary
    The Madurai Bench of Madras High Court on Wednesday dismissed a writ petition filed by an aspiring filmmaker accusing the crew of Rajinikanth starrer Lingaa of having stolen his story, based on the construction of Mullaperiyar dam, for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X