twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో సిద్దార్దపై ఛీటింగ్ కేసు

    By Srikanya
    |

    చెన్నై పోలీసులు హీరో సిద్దార్దపై ఓ ఛీటింగ్ కేసుని బుక్ చేసారు. బాలు అనే ఇంటీరియర్ డిజైనర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని బుక్ చేసారు. చెన్నై అన్నామలైపురమ్ లోని ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకున్న సిద్దార్ధ తనకు దాదాపు రెండు లక్షలు పైగా డబ్బుని ఎగ్గొట్టాడని ఆ కంప్లైంట్ లో ఉంది. తనకి ఆరు లక్షల అరవై మూడు వేలకు వర్క్ ఇచ్చాడని, అయితే నాలుగు లక్షల ముప్పై వేలు ఇచ్చి తప్పించుకుంటున్నాడని ఆ కంప్లైంట్ లో ఉంది. తాను సిద్దార్దని ఆ విషయమై అడగటానకి ఇంటికి వెళితే సిద్దార్ద తండ్రి తనకి డబ్బు ఇవ్వకుండా బిదిరించాడని, ఇబ్బందిపెట్టాడని కంప్లైంట్ చేసాడు. సిద్దార్ద ఈ విషయమై వివరణ ఇవ్వటానకి అందుబాటలో లేరు. దాంతో చెన్నై పోలీసులు ఈ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకుని విచారణ చేస్తామని చెప్పారు.

    ఇక సిద్దార్ద చిత్రం ఓహ్ మై ప్రెండ్ డిజాస్టర్ అయ్యింది. తెలుగులో అతను నటించిన చిత్రాలన్నీ వరసలో ఫెయిల్యూర్స్ అవుతూ వస్తున్నాయి. తాజాగా దిల్ రాజు ఎంతో హోప్స్ పెట్టుకుని నిర్మించిన ఈ చిత్రం కూడా మొండిచెయ్యి చూపించింది. ప్రస్తుతం సిద్దార్ధ లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రం బిజీలో ఉన్నారు. తాను నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రంలో నటించనున్నాడు. సమంత హీరోయిన్ గా చేసే ఆ చిత్రాన్ని నందినీ రెడ్డి డైరక్ట్ చేయనుంది. అలా మొదలైంది లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమని చెప్తున్నారు.

    English summary
    Chennai police have registered a cheating case against hero Siddharth. The case was registered on the complaint of one Balu, an interior decorator.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X