హీరోయిన్ హన్సిక మీద కేసు నమోదు, కారణం ఇదే...

హీరోయిన్ హన్సిక మీద తమిళనాడులో కేసు నమోదైంది. హన్సిక నటిస్తున్న కోలీవుడ్ మూవీ 'మహా' పోస్టర్ వివాదాస్పదంగా ఉండటమే అందుకు కారణం. దీంతో పిఎంకె లీడర్ జానకి రామన్ హన్సికతో పాటు దర్శకుడు జమీల్ మీద కోర్టులో కేసు వేశారు.

'మహా' మూవీలో రుద్రాక్షమాల ధరించిన హన్సిక పొగ త్రాగుతున్నట్లు చూపించడంపై జానకిరామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని ఆయన ఆరోపించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తన పిటీషన్లో కోరారు.

వివాదానికి కారణమైన పోస్టర్ ఇదే...

వివాదానికి కారణమైన పోస్టర్ ఇదే...

వివాదానికి కారణమైన హన్సిక పోస్టర్ ఇదే. అయితే చిత్ర బందం మాత్రం అఘోరాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ పోస్టర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసుపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

హన్సిక కెరీర్లో 50వ చిత్రం

హన్సిక కెరీర్లో 50వ చిత్రం

హన్సిక కెరీర్లో ‘మహా' 50వ చిత్రం. యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హ‌న్సిక డిఫ‌రెంట్ షేడ్స్‌లో వెరైటీ లుక్‌లో క‌నిపించనుంది. గ‌తంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర‌లో హ‌న్సిక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 తమిళంలో సెటిలైన హన్సిక

తమిళంలో సెటిలైన హన్సిక

తెలుగు చిత్రం ‘దేశముదురు ' చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన హన్సిక అప్పట్లో టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. అయితే క్రమక్రమంగా తెలుగులో అవకాశాలు తగ్గడం, తమిళంలో తనకు ఎక్కువ ఆదరణ లభించడంతో చెన్నైలోనే సెటిలైంది. హన్సిక తెలుగులో చివరగా 2017లో వచ్చిన ‘గౌతం నందా' చిత్రంలో నటించింది.

త్వరలో మరో తెలుగు మూవీ

త్వరలో మరో తెలుగు మూవీ

కాగా... హ‌న్సిక త్వరలో మరో తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. సందీప్ కిష‌న్ హీరోగా రూపొందబోయే ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వం వహించబతున్నారు. ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్' అనే టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X