నయనతార, విఘ్నేష్ శివన్‌ను అరెస్ట్ చేయండి.. పోలీస్ కేసు నమోదుతో టెన్షన్!

దక్షిణాదిలో స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్‌కు సంబంధించిన ప్రొడక్షన్ హౌజ్ రౌడీ పిక్చర్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత స్వేచ్చను, మానసిక ప్రశాంతతను హరించారని సామాజిక కార్యకర్త తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 రౌడీ పిక్చర్స్ బ్యానర్‌తో ఆస్కార్ బరిలో

రౌడీ పిక్చర్స్ బ్యానర్‌తో ఆస్కార్ బరిలో

నయనతార, విజయ్ సేతుపతి జంటగా దర్శక, నిర్మాత విఘ్నేష్ శివన్ రూపొందించిన నానుమ్ రౌడీధాన్ చిత్రం తర్వాత రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను నయనతార ప్రారంభించారు. ఆ తర్వాత ఈ బ్యానర్‌పై పెబెల్స్, రాకీ చిత్రాలను నిర్మించారు. పెబెల్స్ చిత్రం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్స్ ఫిలింగా ఎంపికైంది. ఇక రాకీ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకొన్నది.

 సమంత, విజయ్ సేతుపతితో

సమంత, విజయ్ సేతుపతితో


రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటికే రూపొందించిన కాథువాకులా రెండు కాదల్ చిత్రం పూర్తయింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి కలిసి నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానున్నది. ఇలాంటి ఉత్సాహంతో భారీ చిత్రాలను రూపొందించే పనిలో పడ్డారు.

అజిత్ కుమార్‌తో భారీ చిత్రం

అజిత్ కుమార్‌తో భారీ చిత్రం


ఇటీవల తన సొంత బ్యానర్‌ రౌడీ ప్రొడక్షన్స్‌పై సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా #AK62 చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ఎత్తున్న బాణాసంచాను పేల్చారు. దీపావళీ టపాసులను భారీగా కాల్చి హంగామా చేశారు. ఈ వ్యవహారం మాకు తీరని ఇబ్బందిని కలుగ జేసింది అని సామాజిక కార్యకర్త కన్నన్ ఫిర్యాదు చేశారు.

నిబంధనలకు విరుద్దంగా

నిబంధనలకు విరుద్దంగా


నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాణాసంచాను పేల్చిన రౌడీ పిక్చర్స్‌పై కేసు నమోదు చేయాలి. ఇందుకు బాధ్యులైన నయనతార, విఘ్నేష్ శివన్‌ను అరెస్ట్ చేయాలి అని కన్నన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై అటు నయనతార గానీ, ఇటు విఘ్నేష్ శివన్ గానీ పెద్దగా స్పందించలేదు. దాంతో ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

చిరంజీవితో నయనతార

చిరంజీవితో నయనతార


నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ చిత్రంలో నయనతార నటిస్తున్నది. మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ రూపొందుతన్నది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X