శరత్ కుమార్‌పై కేసు నమోదు.. ఆ ల్యాండ్ ఏమైంది!
తమిళ చిత్ర పరిశ్రమ నడిగర్ సంఘంలో అను నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. తాజగా సీనియర్ నటుడు శరత్ కుమార్ పై కాంచీపురం పోలీస్ లు కేసు నమోదు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం 26 సెంట్ల స్థలాన్ని అమ్మేసినట్లు శరత్ కుమార్ పై అభియోగం ఉంది.
గతంలో శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రస్తుతం ఉన్న నడిగర్ సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

శరత్ కుమార్ తో పాటు రాధారవి, సెల్వరాజ్ పై కూడా కేసు నమోదైంది. వీరంతా శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సభ్యులుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











