కులం పేరు చెప్పి అనుష్క సినిమాను ఆపేస్తున్నారు
విక్రమ్, అనుష్క కాంబినేషన్ లో రూపొందుతున్న తమిళ చిత్రం 'దైవ తిరుమగన్". ఈ చిత్రం విడుదలకు ఇప్పుడు కుల సంఘాలు అడ్డంగా నిలుస్తున్నాయి. తమిళనాడులో తేవర్ కులానికి చెందిన కుటింబీకులు ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. దానికి కారణంగా ఈ చిత్రం టైటిల్ అని చెప్తున్నారు. ఈ టైటిల్ లోని దేవ తిరుమగన్ అనే పేరు తమ కుల దేముడుకి మారు పేరుట. వారి కుల దైవం పేరు పనుప ముత్తు రామలింగ తేవర్. దాంతో తమ కులాన్ని సినిమాకు పెట్టి అవమానిస్తున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్ చేసారు. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి సినిమా రిలీజ్ ను ఆపమని లేదా టైటిల్ మార్చుకోమని చెప్పమని కోరాట్ట. దీనికి తోడు అక్కడ శివసేన కూడా వీరికి సపోర్టు పలుకుతోంది. దాంతో ఈ సినిమా రిలీజ్ ఆగింది.
ఇక ఈ చిత్రం త్వరలో తెలుగులోకి అనువాదం కానుంది. శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాల తర్వాత విక్రమ్‌కు తెలుగులో విజయాలు లేకపోయినప్పటికీ అతని సినిమాలకు క్రేజ్ రావటం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. అంతకుమించి ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఈ చిత్రం అనువాద హక్కులకు డిమాండ్ ఏర్పడుతోంది. 'దైవ తిరుమగన్" అంటే తెలుగులో 'దేవుని బిడ్డ" అని అర్దం. ఈ చిత్రంలో విక్రమ్ బుద్ధిమాంద్యంతో బాధపడే కుర్రాడిగా నటించాడు. 'శివపుత్రుడు" చిత్రానికిగాను ఇప్పటికే జాతీయ అవార్డునందుకున్న విక్రమ్ ఈ చిత్రంలో మరోసారి అవార్డ్ విన్నింగ్ పెర్‌ఫార్మెన్స్ ప్రదర్శించాడని చెప్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











