అమ్మడు అరవంలో అడుగుపెట్టి ఆరేళ్ళు అవుతుందట ..
2013లో వచ్చిన ఛమ్మక్ ఛల్లో సినిమాతో టాలీవుడ్ తలుపు తట్టిన చిన్నది కేథరిన్. . సరైన బ్రేక్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోంది. చాలా వరకు రెండో హీరోయిన్‌గా అవకాశాలే వస్తుండటంతో... నటిగా నిరూపించుకునే పాత్రల కోసం ట్రై చేస్తోంది. చివరగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో స్మితా మేడం పాత్రలో ఆకట్టుకుంది. కేథరిన్ తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. దర్శకుడు రంజిత్ డైరెక్షన్ లోమద్రాస్ సినిమాతో తో తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా నేటికీ విడుదలై ఆరు సంవత్సరాలు అవుతుంది, ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 26) న విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా సంగతులను గుర్తు చేసుకుంది కేథరిన్.. కోలీవుడ్‌లో అరంగేట్రం చేసినందుకు ఇంతకంటే మంచి సినిమా,మంచి క్యారెక్టర్ నాకు దొరికేది కాదేమో అని పోస్ట్ పెట్టింది. ఇక అమ్మడి స్వీట్ గెస్చర్ కు ఫిదా అవ్వని జనాలు ఉంటారు అంటారా!?


Click it and Unblock the Notifications











