సీబీ సిఐడి నుంచి నోటీసులు అందుకున్న 'రోబో' శంకర్
ఘన విజయం సాధించిన "రోబో" చిత్రం కాపీ వివాదం దర్శకుడు శంకర్ కి రోజు రోజుకూ ఓ కొత్త తలనొప్పిని తెచ్చుపెడుతోంద. తమిళనాడుకు చెందిన అముద అనే కలం పేరుతో రచనలు చేసే అరూర్ తమిళ్‌నాదన్ అనే ఈ వ్యక్తి ఆధ్య చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో సీబీ సిఐడి వారు..శంకర్ కు ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. ఈ మేరకు శంకర్...సోమ,మంగళ వారాల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక శంకర్ మాత్రం తను తీసిన రోబో...దివంగత రచయిత సుజాత రాసిన నవల ఆధారంగా తీసానని చెప్తున్నారు.
ఏప్రిల్ 1996లో ఇనియ ఉదయం, 2007లో థిక్ థిక్ దీపిక్ అనే తమిళ పత్రికల్లో ప్రచురితమైన తన కథానిక 'జుగిబా'ను రోబో మూలకథనంగా చౌర్యం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీన 'రోబో' సినిమా విడుదలైన తర్వాత ఆ చిత్రాన్ని చూసిన తన ప్రెండ్స్, పాఠకులు ఫోన్ చేసి అది 'జుగిబా' కథానికకు కార్బన్ కాపీయేనని చెప్పారని అరూర్ తమిళ్‌నాదన్ తమ కంప్లైంయింట్ తో రాసారు.
ఇక రోబో చిత్రం కథ తమదేనంటూ తెలుగునుంచి కూడా కొన్ని కాపీ వివాదాలు రేగాయి. ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ రోబోలోని అన్ని సన్నివేశాలు తన రాసిన బుద్దిజీవి నవలనే పోలి ఉన్నాయని అన్నారు. తన నవలకు కాపీ కొట్టినందున సన్ పిక్చర్స్ అధినేతకు లీగల్ నోటీసులు పంపినట్టు మైనంపాటి చెప్పారు. సినీ నిర్మాత కళానిథి మారన్ కు, దర్శకుడు శంకర్ కు కూడా లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. అలాగే మరో రచయిత విజయార్కే...రోబోకు తన రాసిన 'మేన్ రోబో" కు బాగా దగ్గర పోలికలున్నాయని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. తాను రెండు సంవత్సరాలు కష్టపడి 2002 లో రాసిన 'మేన్ రోబో" నవల హ్యూమన్ ఎమోషన్స్, ఇంటలెక్చువల్స్,ప్రేమ తదితర అంశాలతో ద్విపాత్రాభినయంతో నవల రాసానని అన్నారు.


Click it and Unblock the Notifications











