twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోలీవుడ్ లోనూ "ఒక్కడు మిగిలాడు" కథే: ఏకంగా "నీలం" ట్రైలర్ ని బ్యాన్ చేసిన సెన్సార్ బోర్డ్

    వెంకటేష్‌ కుమార్‌ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్రం నీలం ట్రైలర్‌ చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో డైలాగ్‌లు అధికంగా ఉన్నాయంటూ ట్రైలర్‌కు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించారు.

    |

    తమిళ ఇండస్ట్రీ లో ఈ మధ్యనే వచ్చిన కుర్రాడు వెంకటెష్ కుమార్ అంటే ఒక విధమైన అభిమానం అటు జనాల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఉంది. వచ్చిన మూడేళ్ళలోనే ఉనకుల్‌ నాన్, లైట్ మెన్, బ్యూటిఫుల్‌ ఐ వంటి చిత్రాలను రూపొందించి. కొత్త ట్రెండ్ చూపించాడు. అన్ని సినిమాలూ సాధారణ జీవితాల్లోంచి వచ్చిన సంఘటనల ఆధారంగ తీసినవే.

     నీలం

    నీలం

    వెంకటేష్‌ కుమార్‌ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్రం నీలం. బ్లూవేవ్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ ద్వారా వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇందులో శ్రీ, పవిత్రా, జగన్, జయకుమార్‌ వంటి పలువురు నటించారు. సతీష్‌ చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా. రామలింగం స్క్రీన్‌ప్లే చేశారు.

     ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో

    ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో

    నీలం చిత్రాన్ని శ్రీలంకలో జరిగిన అంతర్గత పోరు, ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో రూపొందించారు. ఇప్పటికీ షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ సిద్ధమైంది. దీనిని సెన్సార్‌ అధికారుల తనిఖీ కోసం పంపారు. ట్రైలర్‌ చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో డైలాగ్‌లు అధికంగా ఉన్నాయంటూ ట్రైలర్‌కు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించారు.

    ఈలం తమిళుల నేపథ్యంలో

    ఈలం తమిళుల నేపథ్యంలో

    ఈ విషయం గురించి చిత్ర దర్శక నిర్మాత వెంకటేష్‌ కుమార్‌ మాట్లాడుతూ నీలం చిత్ర ట్రైలర్‌ను సెన్సార్‌ బృందం నిరాకరించారని తెలిపారు. ఈ చిత్రం ఈలం తమిళుల నేపథ్యంలో చిత్రీకరించినందున సర్టిఫికేట్‌ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. ఇది తన ఐదేళ్ల శ్రమ. ఈ చిత్రం పూర్తిగా తమిళుల కోసం రూపొందించింది. తనకు న్యాయం కావాలని వెంకటేష్‌ కోరుతున్నారు.

     అనధికార చట్టం

    అనధికార చట్టం

    ఈళం తమిళులమీద సినిమాలని గానీ, వీడియోలని గానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఒప్పుకోవటం లేదు. శ్రీలంకతో ఉండే మితృత్వ సంభందాలు పాడవుతాయన్న కారణం తో అక్కడి తమిళులమీద వచ్చే ఏరకమైన సినిమాని మనదేశం లో తీయటానికి వీల్లేదంటూ అనధికార చట్టం కొనసాగుతూనే ఉంది.

     ఒక్కడు మిగిలాడు

    ఒక్కడు మిగిలాడు

    మన టాలీవుడ్ లోనూ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తీసిన "ఒక్కడు మిగిలాడు" అనే సినిమాకూడా తమిళ ఈలం పోరాట నేపథ్యం లోనే ఉన్నదనే కారణంతో విడుదలకు అడ్డుపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం "ఒక్కడు మిగిలాడు లో కొన్ని కట్స్, మరికొన్ని డైలాగులని మ్యూత్ చేసి విడుదలకి అనుమతించారట. మరి ఇప్పుడు వెంకటేష్ కుమార్ పరిస్థితి ఏమిటో.., అసలు ట్రైలరే ఇలా ఉంటే మొత్తం సినిమా ఎలా ఉంటుందో...

    English summary
    The Censor Board has reportedly said that the 'Neelam' trailer could hamper relations between India and Sri Lanka.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X