నిత్యానంద జీవితం సినిమాకు సెన్సార్ అభ్యంతరం
నిత్యానంద జీవితాన్ని సినిమాగా తీయటం గానీ, ఆయన జీవితంలోని సంఘటనలకు సినిమాగా ఉపయోగించుకోవటానికి సెన్సార్ అభ్యంతరం తెలుపుతోంది. అలాగే కాంచీపురం ఆల య అర్చకుడు దేవనాధన్‌ల చుట్టూ కూడా కథ అల్లితే ఏక్సెప్ట్ చేయబోమని అన్నారు. నిత్యానంద స్వామి, కాంచీపురం ఆలయ అర్చకుడు దేవనాధన్‌ల ఇతివృత్తంతో విల్లాళన్ పేరుతో ఒక చిత్రం రూపొందుతోంది. ఇందులో నూతన నటుడు వెట్రివేల్ హీరోగా, నటి అస్మిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. కంటోన్మెంట్ సి.షణ్ముగమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెట్రివేల్, సూరియన్‌ల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు.
అయితే నిత్యానంద స్వామి, అర్చకుడు దేవనాధన్ పాత్రల సన్నివేశాలకు అభ్యంతరం తెలిపారు. చిత్రంలో హీరో అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా నటించారు. నిత్యానంద స్వామి రాసలీలల గురించి మహిళలు ఫిర్యాదు చేయడంతో ఆయన్ని అరెస్టు చేసే సన్నివేశాలను, ఆలయంలో రాసలీలలు జరిపిన అర్చకుడు దేవనాధన్ సన్నివేశాలను తొలగించి చిత్రానికి యు సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర దర్శకులు వెల్లడించారు. అయితే తాను వారి గురించి ఒక పాటలోనే చూపించామని దర్శకుడు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











