నయనతార హాట్ సాంగ్ కి సెన్సార్ కట్

జి.కె ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై విక్రమ్ కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో ఓ హాట్ సాంగ్ (విశాల్,నయనతార లపై)చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సెమీ న్యూడ్ గా లిప్ కిస్ లతో ఉన్న ఆ పాటను చూసి సెన్సార్ షాక్ అయ్యిందని చెప్తున్నారు. ట్రేడ్ లోనూ ఈ పాట పేరు చెప్పే మంచి మార్కెట్ అయింది. అయితే ఆ పాటకు చాలా చోట్ల సెన్సార్ కట్స్ పడ్డాయని తెలుస్తోంది. తమిళంలో సత్యం పేరుతో రిలీజవుతున్న ఈ సినిమాకు “UA" సర్టిఫికేట్ ఇచ్చారు.
కానీ తెలుగులో మాత్రం “A" సర్టిఫికేట్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలోని చెల్లామే..చెల్లామే పాటకు పూర్తి స్ధాయి కట్స్ ఇచ్చారుట.అలాగే చాలా రెచ్చకొట్టే విధంగా వైలంట్ సీన్స్ కూడా చోటుచేసుకోవటంతో సెన్సార్ పూర్తిగా జోక్యం చేసుకుని కత్తెరకి పని చెప్పారని తెలుస్తోంది. రాజశేఖర్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేసిన ఈ సినిమా ఓ పోలీసు స్టోరీ .
ఇక ఈ సినిమా మలేషియాలనోనూ రిలీజవుతోంది.అయితే అక్కడ ఆ పాట చూసి పూర్తిగా కట్ చేసారని తెలుస్తోంది. అంటే అక్కడ సెన్సార్ మన కన్నా పదునుగా ఉండి మరింత భాద్యతగా వ్యవరిస్తోందని తెలుస్తోందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి అక్కడ ప్రీమియర్ కి అటెండయిన విశాల్ స్పందిస్తూ ఈ పాట తీసేసినా కథకు పెద్దగా అడ్డురాదని సెలవిచ్చాడు. అంటే కథకు సంభంధం లేకపోయినా మనలోని బలహీనలతలను రెచ్చకొట్టి సొమ్ము చేసుకుందామనేగా ప్రయత్నం.


Click it and Unblock the Notifications











