twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలో శుభవార్త.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్.. అఫైర్లుకో ఓ దండం అంటూ..

    |

    యాక్షన్ హీరో విశాల్‌ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చక్ర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విశాల్ మరోసారి తన వ్యక్తిగత విషయాలపై మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా తన పెళ్లిపై విశాల్ క్లారిటీ ఇస్తూ..

    కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత... కురచ దుస్తుల్లో హంగామా

    మూడేళ్లలో వరుస బ్రేకప్స్

    మూడేళ్లలో వరుస బ్రేకప్స్

    గత మూడేళ్లలో విశాల్ వ్యక్తిగత జీవితం పలు కుదుపులకు గురైంది. తన జీవితంలో రెండు బ్రేకప్‌లు జరగడం తెలిసిందే. ఒకటి వరలక్ష్మీ శరత్ కుమార్, మరోటి అనిషా అల్లారెడ్డితో అఫైర్లు బ్రేక్ అయ్యాయి. దాంతో ప్రస్తుతం విశాల్ సింగిల్ స్టేటస్‌తో ముందుకెళ్తున్నాడు.

    వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అఫైర్ అంటూ

    వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అఫైర్ అంటూ

    గతంలో తమిళ చిత్ర పరిశ్రమలో వరలక్ష్మీ శరత్ కుమార్, విశాల్ మధ్య అఫైర్ మీడియాలో హాట్ టాపిక్ కావడం తెలిసింది. వారిద్దరి మధ్య అఫైర్ వార్తలు చాలా కాలం మీడియాలో కనిపించాయి. నడిగర్ సంఘం భవనం నిర్మాణం జరిగిన తర్వాత తాను పెళ్లి చేసుకొంటానని విశాల్ ప్రకటించారు. అయితే అనూహ్యంగా వరలక్ష్మీతో బ్రేకప్ జరగడం చర్చనీయాంశమైంది.

     అనీషాతో నిశ్చితార్థం బ్రేకప్

    అనీషాతో నిశ్చితార్థం బ్రేకప్

    ఇలాంటి వార్తల మధ్య అనిషాతో నిశ్చితార్థం చేసుకొన్న విశాల్ మీడియాకు, అభిమానులకు షాక్ ఇచ్చారు. వారిద్దరూ పెళ్లి జరుగుతుందని భావించిన వారందరికి బ్రేకప్ వార్తను అందించారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ వస్తున్నాడు. తాజాగా తన రిలేషన్‌షిప్ స్టాటస్ గురించి క్లారిటీ ఇచ్చారు.

    సింగిల్ గానే ఉన్నా.. ఎవరితోనూ రిలేషన్ లేదు

    సింగిల్ గానే ఉన్నా.. ఎవరితోనూ రిలేషన్ లేదు

    విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇప్పట్లో అఫైర్లు పెట్టుకొనే అవకాశం లేదు. నా జీవితంలో పెళ్లి జరగాలని రాసి ఉంటే.. అప్పుడే జరుగుతుంది. విధిరాతను తప్పించలేం. నా జీవితంలో ఊహించని విషయాలు జరుగుతున్నాయి అని విశాల్ చెప్పారు.

    నటుడిని అవుతానని ఊహించలేదు

    నటుడిని అవుతానని ఊహించలేదు

    నా జీవితంలో నేను నటుడిగా మారుతానని అనుకోలేదు. ఆ తర్వాత నిర్మాతను అవుతానని ఊహించలేదు. అలాగే దర్శకుడిని అవుతానని కూడా అనుకోలేదు. గత 19 ఏళ్లుగా నేను సక్సెస్ ఫుల్ నటుడిగా కొనసాగుతున్నాను. విధి రాత ప్రకారం వెళ్లడమే తప్ప ఊహించడం తప్పు అని విశాల్ అన్నారు.

    డైరెక్టర్‌గా మారుతున్న విశాల్

    డైరెక్టర్‌గా మారుతున్న విశాల్

    చక్ర మూవీ సందర్భంగా ఇంటర్వ్యూ ఇస్తూ.. మరోసారి మీరు ఇంటర్వ్యూ కోసం కలిస్తే శుభవార్త చెబుతాను. అప్పటి వరకు ఆగాల్సిందే అంటూ విశాల్ తన పెళ్లిపై హింట్ ఇచ్చారు. ఇక విశాల్ విషయానికి వస్తే.. త్వరలోనే తుప్పరివాలన్ 2తో దర్శకుడిగా మారబోతున్నారు.

    English summary
    Kollywood star and Chakra movie hero Vishal given clarity on Marriage, Relationship status. He said, I am single. but I would like to get married when time comes. Vishal reveals that He will give good news in his next Interview
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X