పండుగ కానుకగా తమిళంలో కృష్ణవంశి చందమామ రీమేక్ అఆఇఈ రిలీజైంది. అయితే ఇక్కడ హిట్టయినైంతలా అక్కడ వర్కవుట్ అయ్యే వాతావరణం కనపడటం లేదు. తమ పాత తమిళ సినిమాలను చూసిన ఫీలింగ్ కలుగుతోందంటూ ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇక తెలుగులో పందెం సినిమాను డైరక్ట్ చేసిన సభాపతి అక్కడ ఆ సినిమాను డైరక్ట్ చేసాడు. ప్రముఖ బ్యానర్ ఎవియం వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవదీప్ తెలుగులో తను పోషించిన పాత్రను అక్కడా అలాగే చేసాడు.అరవింద్ అనే యంగ్ హీరో శివబాలాజీ పాత్రను పండించాడు. అలాగే సీనియర్ నటుడు ప్రభు ఇక్కడ ఆహుతి ప్రసాద్ చేసిన హీరోయిన్స్ తండ్రి పాత్రను పోషించాడు. హీరోయిన్స్ లో కాజల్ చేసిన పాత్రను మోనిక అనే అమ్మాయి చేస్తే సింధు మీనన్ పాత్రను శరణ్య మోహన్ పోషించింది. సంగీతం విజయ్ ఆంటోని అందించారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఫెయిల్యూర్ గా అక్కడ పేర్కొంటున్నారు. కథలో అనేక ట్విస్టులు ఉన్నప్పటికీ అవి ఇంట్రస్టింగ్ గా మలచలేకపోయాడని,డ్రామా మరింత చిక్కగా ఉండాల్సిందనీ,కథ మరీ ఊహకందుతోందని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఓ బోర్ సినిమాగా తేల్చారు. దీన్ని బట్టి కథ కన్నా ఇక్కడ కృష్ణ వంశి ప్రెజెంట్ చేసిన విధానాన్ని బట్టి సినిమా ఆడిందని అర్ధం చేసుకోవాలి.