రజనీకాంత్ 'చంద్రముఖి 2' కి ఆ రీమేక్ కన్ఫర్మ్
పి.వాసు, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో వచ్చిన ఆప్త మిత్ర చిత్రాన్ని అప్పట్లో చంద్రముఖి గా రజనీకాంత్,జ్యోతికలతో రీమేక్ చేసి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వరసలో మళ్ళీ అదే కాంబినేషన్ లో పి.వాసు రూపొందించిన ఆప్త రక్షక అనే కన్నడ చిత్రాన్ని రజనీకాంత్ స్పెషల్ షో వేయించుకుని రీసెంట్ గా చూసారు. ఏవియం స్టూడియోస్ లో జరిగిన ఈ స్క్రీనింగ్ కి సినిమా చివరి పదినిముషాలు జరుగుతూండగానే లేచి దర్శకుడిని హత్తుకుని అద్బుతమన్నారు. దాంతో ఈ చిత్రం రజనీకాంత్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విష్ణు వర్ధన్ 200వ సినిమాగా దీన్ని కన్నడ ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ షో అనంతరం చెన్నైలో శివాజి ప్రొడక్షన్స్ లో ప్రభు, రామ్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ చేసారు. ప్రభు కూడా ఈ చిత్రం చూడగానే ఎమోషనల్ గా పి.వాసుని మొచ్చుకుంటూ మాట్లాడారు. అంటే రజనీకాంత్ ఈ చిత్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రజనీ,శంకర్ కాంబినేషన్ లో రోబో చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం అనంతరం ఏ చిత్రం చేయాలి అన్న విషయమై రజనీ రకరకాల ఆఫ్షన్స్ పరిశీలుస్తున్నారు. వీటిల్లో ఈ చిత్రం రీమేక్ చేసే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications