twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    17 ఏళ్ళ తరువాత చంద్రముఖి సీక్వెల్.. అంతకుమించి అనేలా..

    |

    2005లో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాను తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రజనీ కాంత్ కు అప్పట్లో ఆ సినిమా మరికొంత బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. తెలుగులో కూడా సినిమా 13 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి కలుగజేసింది.

    అయితే మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించెందుకు దర్శకుడు పి.వాసు సిద్ధమయ్యాడు. అసలైతే గత ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు పై దర్శకుడు చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ స్క్రిప్టు విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నాగవల్లి సినిమా చంద్రముఖికి నాగవల్లి సీక్వెల్ అని అందరూ అనుకున్నారు. కానీ అది కాదు అని దర్శకుడు అప్పుడే క్లారిటీ ఇచ్చాడు.

    chandramukhi 2 official announcement and movie story line

    ఇక ఇప్పుడు మాత్రం చంద్రముఖి 2 పక్కా సీక్వెల్ అని చెబుతున్నారు. ఒక పాము గా వెళ్లిపోయిన చంద్రముఖి మళ్లీ ఎక్కడికి వెళ్లింది తన ప్రియుడిని కలుసుకోవడానికి ఎలాంటి దారిని ఎంచుకుంది అనేది సీక్వెల్లో అసలు కథ అని తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. రజనీకాంత్ అభిమానిగా లారెన్స్ ఈ సినిమాలో ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడతాడాని తెలుస్తోంది.

    హారర్ కామెడీ సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న రాఘవ లారెన్స్ అయితే ఈ కథకు కరెక్ట్ గా సెట్ అవుతాడు అని పి వాసు నిర్ణయం తీసుకున్నాడు. ఇక వడివేలు కూడా చాలా కాలం తర్వాత ఈ సినిమాతో సరికొత్త గారి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రముఖ లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. అలాగే RRR మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. మరి ఈ చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    chandramukhi 2 official announcement and movie story line
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X