క్యారెక్టర్ ఆర్టిస్టు...ప్రకాష్ రాజ్ కు విడాకులు మంజూరు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు విడాకులు మంజూరు అయ్యాయి. అతని భార్య లలితాకుమారితో ఆయనకు డైవర్స్ గ్రాంట్ చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. పలు వివషాలపై విభేదాలు వచ్చి కోర్టు కెక్కిన వీరు ఫైనాన్సియల్ సెటిల్మెంతో విడిపోయారు. లలితా కుమారి ..మరో ప్రముఖ డాన్సర్ డిస్కో శాంతి సోదరి. అంటే తెలుగులో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెలుగుతున్న శ్రీహరి కి ప్రకాష్ రాజ్ నిన్నటివరకూ తోడల్లుడు. ఇక ఇద్దరూ విడాకులు కోరుకోవటం కోర్టు ఈ తీర్పు ఇచ్చినట్లుగా జడ్జిమెంట్ లో చెప్పటం జరిగింది. కోర్టు బయిట కొందరు పెద్దల సమక్షంలో ఈ ఫైనాన్సియల్ సర్ధుబాటు జరిగింది. విడాకులు మంజూరు కావటంతో లలిత తిరిగి తమిళ చిత్ర పరిశ్రమకు తరలి వెళ్ళుతోంది. ఆమె రీఎంట్రీ చిత్రం మర్యాదై. సత్యరాజ్ సరసన చేయటానికి కమిట్ అయ్యింది. తిరిగి ఆమె పరిశ్రమకు వేషాలు కోసం రావటంతో చాలా మంది ఆమెను ప్రోత్సహించే వాతావరణం కనపడుతోంది.


Click it and Unblock the Notifications











