రేప్ ఆరోపణలు ఖండించిన చరణ్

By Srikanya

తనపై హీరోయిన్ సోనా చేసిన రేప్ ఆరోపణలను ఎస్పీ చరణ్ ఖండించారు. అలాగే దర్శకుడు వెంకట్ ప్రభు సైతం ఈ విషయం కావాలని చేస్తున్న ఆరోపణలు కానే అబివర్ణించారు.వివరాల్లోకి వెళితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ఓ రేప్ కేసులో ఇరుక్కునారు. తమిళ నటి సోనా కథనం ప్రకారం మన కథ అనే తమిళ సినిమా సక్సెస్ పార్టీలో ఎస్పీ చరణ్ తన పై అత్యాచార యత్నం చేసాడని, అక్కడే ఉన్న దర్శకుడు వెంకట ప్రభు అసభ్యంగా తనను దూషించాడని ప్రెస్ మీట్ లో చెప్పింది. ఈ విషయమై ఆమె పాండీబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. నటి సోనా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కాని రెమ్యునరేషన్ డిమాండ్ ఒప్పందం కుదరక సోనా ఆ సినిమా వదులుకుంది. ఆ సినిమాకు ఇచ్చిన డేట్స్ ను గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్ తనకు ఇమ్మని శ్లేషార్ధాలతో అడిగారని, ఆ తరువాత అఘాయిత్యం చేయబోయారని ఆమె కథనం. పది రోజులు లోపు తనకు ఎస్పీ చరణ్, వెంకట ప్రభు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్పీ చరణం కథనం మరోలా ఉంది. తనకు నటి సోనాకు ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని, పార్టీకి అటెండ్ అవ్వడం, బిజినెస్ గురుంచి ఆమెతో మాట్లాడటం నిజమేనని, కాని మిస్ బిహేవ్ చేయలేదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ చరణ్ తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెంకట ప్రభు సినిమాలలో నటుడిగా కూడా చరణ్ కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X