దేవి ఆమెతో తిరుగుతున్నాడని చార్మి ఏడుపు?
దేవిశ్రీ ప్రసాద్, గాయని మమతామోహన్ దాస్ ల మధ్య ఎఫైర్ శృతిమించి రాగాన పడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రీసెంట్ గా చెన్నైలో ఓ హాట్ పార్టీకి అటెండయ్యారు. సూర్యతో చేసిన సింగమ్ సినిమా హిట్టవటంతో దానికి పాటలిచ్చిన దేవిశ్రీకి డిమాండ్ తమిళంలో విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మమతా మోహన్ దాస్ తో కలసి పబ్ లలో, పార్టీలలో దేవి దర్శనమిస్తున్నాడు. అంతేగాక మమతని తమిళంలోని కొన్ని చిత్రాలకు రికమెండ్ చేస్తున్నాడు.
ఇదంతా ఒకెత్తు అయితే మొన్న గురువారం దేవి, మమతా కలిసి కరాటే కిడ్ చిత్రానికి ప్రీమియర్ షోకి అటెండయ్యి చివరి వరకూ కూర్చుని ఎంజాయ్ చేసారు. ఇది ఫోటోలతో సహా బయిటకు రావటంతో చార్మి ఒంటికి కారం రాసుకున్న ఫీలింగ్ ఉందని చెప్తున్నారు. ఆ మధ్య తను నటించిన సయ్యాట చిత్రానికి సంగీతం అందించి ఆడియో పంక్షన్ కి వచ్చి, తనతో ఆడిపాడిన దేవి అప్పుడే మరో మగువతో ఉండటం జీర్ణించుకోలేకపోతోంది. అసలే కెరీర్ పరంగా బాగా డల్ గా ఉన్న చార్మికి ఈ కొత్త చిక్కు వచ్చి పడటం ఇబ్బందే అంటున్నారు.


Click it and Unblock the Notifications











