twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను అమాయకురాలిని: పోలీసు విచారణలో భువనేశ్వరి

    By Bojja Kumar
    |

    చెన్నై: శృంగార నటి భువనేశ్వరిపై చీటింగ్ కేసుతో పాటు వ్యభిచారం తదితర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భువనేశ్వరిని రూ. 1.5 కోట్ల చీటింగ్ కు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీవీ సీరియల్ నిర్మిస్తానని నమ్మబలికి ఆమె తన వద్ద రూ. 1.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని చెన్నై కెకె నగర్ కు చెందిన రఘునాథన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భువనేశ్వరిని విచారించారు.

    విచారణలో భువనేశ్వరి... తాను అమాయకురాలిని అని వెల్లడించింది. తనకు ఇచ్చింది కొంతే అని. తెల్లకాగితంపై తన సంతకం తీసుకుని ఎక్కువ ఇచ్చినట్లు రాసుకుని తనను మోసం చేసారని భువనేశ్వరి ప్రత్యారోపణలు చేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవార్లు పోలీసులు విచారణ కొనసాగించారు.

    మరో వైపు భువనేశ్వరిపై పదికి పైగా ఫిర్యాదు నమోదయ్యాయి. ఇటీవల ఆమె ఓ థియేటర్ వద్ద అర్ధ నగ్న నృత్యం చేయడం, దానిపై పిర్యాదు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దక్షిణ చెన్నై పరిధిలోని ప్రార్థన థియేటర్ లో తుపాకీ సినిమా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాకు మద్రాస్ హైకోర్టు న్యాయవాది దామోదర్ కృష్ణన్, నటి భువనేశ్వరి కలిసి కారులో థియేటర్ కు వచ్చారు. ఈ కారు ముందు ఉన్న కారు ను ఢీకొనడంతో దామోదర్ కృష్ణన్ ఆ కారుకు చెందిన కుమార్ తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది.

    అదే సమయంలో కారులో ఉన్న భువనేశ్వరి కారు బయటకు వచ్చి ధియేటర్ ముందు తనకు తోచిన రీతిలో చిందు లేసింది. ఆ సమయంలో భువనేశ్వరి తాగిన మైకంలో ఉందని ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నారు. తాగిన మైకంలో అర్థనగ్నంగా ఉన్న భువనేశ్వరి థియేటర్ ముందు నృత్యం చేసిందని వారు చెబుతున్నారు. దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి గతంలో వ్యబిచారం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.

    English summary
    Bhuvaneswari, who is a noted TV actress and a character artist in many Tollywood films, has now booked in cheating case. Bhuvaneswari took 1.5 crore from the fancier for making a TV serial. She did not make the serial and also did not respond to notices from the financier asking for repayment of the amount.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X