పవర్ స్టార్ భార్యలపై చీటింగ్ కేసు!

ఇప్పటివరకు ఆయనపైనే చెక్‌బౌన్స్ కేసులు నమోదవగా, ఇప్పుడు ఆయన ఇద్దరు భార్యలపైనా నగదు మోసం ఫిర్యాదు దాఖలైంది. చెన్నైలోని వడపళనికి చెందిన పారిశ్రామికవేత్త మణ్యం మంగళవారం ఈ విషయమై నగర పోలీసుకమిషనర్ జార్జ్‌కి ఫిర్యాదు చేసారు.
తాను మోసపోయిన తీరును మణ్యం మీడియాకు వివరిస్తూ...తాను మలేషియాలో ట్రాన్స్‌పోర్టు సంస్థను నిర్వహిస్తున్నానని, వ్యాపార పరంగా రూ.100 కోట్లు అవసరమవగా అప్పు కోసం యత్నించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఓ మధ్యవర్తి సాయంతో శ్రీనివాసన్‌ను కలిసి అప్పు గురించి చర్చించానన్నారు.
టాక్స్ సమస్య ఎదురవుతుందని ముందస్తుగా తనకు రూ.2.5 కోట్లు చెల్లించాలని శ్రీనివాసన్ తనను కోరడంతో డాలర్ల రూపంలో ఆ మొత్తాన్ని చెల్లించినట్లు వెల్లడించారు. అనంతరం అప్పు ఇవ్వకపోగా, తాను చెల్లించిన రూ.2.5 కోట్లనూ తిరిగివ్వకుండా హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. ఈ వ్యవహారంలో ఆయన ఇద్దరు భార్యలైన జూలీ, తూరియాలు కూడా ప్రధాన భూమిక పోషించారని తెలిపారు.


Click it and Unblock the Notifications











