మా మద్య కెమిస్ట్రీ బాగా కుదిరింది: తమన్నా...!
వేంగైలో తనది నటనకు ప్రాముఖ్యత ఉన్న మంచి పాత్ర అని నటి తమన్నా అంటున్నారు. టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె కోలీవుడ్ లో నటిస్తున్న ఏకైక చిత్రం వేంగై. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా తొలిసారిగా పల్లెటూరి పిల్లగా నటిస్తున్నారట. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటివరకు మోడ్రన్ యువతి పాత్రలే పోషించానన్నారు. పూర్తి గ్రామీణ కథా చిత్రంలో నటించడం వేంగై చిత్రంలోనే కుదిరిందన్నారు. ఇది తనకు సరికొత్త అనుభూతి అని చెప్పారు. పాటలకే పరిమి తం కాకుండా సెంటిమెంట్ సన్నివేశాల్లోనూ నటించానని తెలిపారు.
ఈ చిత్రంలో నటుడు ధనుష్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయిందంటున్నారని తమన్నా అంటోంది. ప్రస్తుతానికి ఈమె నటించిన చివరి తమిళ సినిమా ఇదే. తమన్నా మాట్లాడుతూ ధనుష్ సరసన తాను నటించిన వేంగై చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిందని తెలిపారు. ఈ చిత్రంలో తన నటనను అభినందిస్తున్నారని తెలిపారు. వేంగై చిత్రంలోని పాటల సన్నివేశాలలో తమ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారన్నారు. తమిళంలో నూతన చిత్రాలేమీ లేవేమిటని అడుగుతున్నారని అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మూడు చిత్రాలు ఒప్పుకున్నానని వాటిని పూర్తిచేసి వచ్చే ఏడాది కోలీవుడ్ పై పూర్తిగా దృష్టి పెడుతానని తమన్నా అంటున్నారు.


Click it and Unblock the Notifications











