మళ్లీ ప్రభుదేవా, నయనలకు సమన్లు! జనవరి 21 హాజరు కావాలని ఆదేశం
విచారణ కోసం కోర్టుకు హాజరుకాని ప్రభుదేవా, నయనతారలకు చెన్నై కోర్టు మరో అవకాశం ఇచ్చింది. జనవరి 21వ తారీఖున కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఇటీవల కోర్టు ప్రభుదేవా, నయనలకు సమన్లు పంపింది. అయితే ఆ సమన్లను వారు తిరస్కరించారు. దీంతో అవి తిరిగి వచ్చాయి. సమన్లు తిరిగి వచ్చిన అనంతరం కోర్టు మరోసారి వారికి ఉత్తర్వుల్ని పంపాలని నిర్ణయించింది. దీంతో వారికి మూడోసారి ఉత్తర్వులు పంపినట్లవుతుంది.
ప్రభుదేవా భార్య రమాలత్ తనను భర్త ప్రభుదేవా నిర్లక్షం చేస్తున్నాడని, ఇంటికి, మా ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని, తన వద్దనే ప్రభుదేవా ఉండేటట్లు ఆమె చెన్నై కోర్టును ఆదేశించింది. నయనతారతో తిరుగుతూ తనను పట్టించుకోవడం లేదని ఆమె కోర్టుకు తెలిపింది. అందుకు స్పందించిన కోర్టు ప్రభుదేవా, నయనతారలను ఇప్పటికే రెండుసార్లు ఉత్తర్వులను పంపినప్పటికి వారి నుండి స్పందన లేదు. రెండోసారి సమన్లను తిప్పి పంపారు. దీంతో మరోసారి సమన్లను పంపేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











