అసిన్ 'అసిస్టెంట్' మిస్టరీ!

By Staff

Asin
గతంలో అసిన్ కు టచ్ అప్ బాయ్ గా పనిచేసిన నల్లా ముత్తుకుమారస్వామి అలియాస్ ముత్తుకుమార్ అదృశ్యమైన కేసును సీరియస్ గా తీసుకున్న చెన్నై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముత్తు తన కుటుంబ సభ్యులకు తెలియకుండా మిస్సింగ్ డ్రామా ఆడాడని, అసిన్ నుంచి డబ్బు కొట్టేయడమే అతని లక్ష్యమని, అతను ఇంత కాలం చెన్నై లోనే ఉన్నాడని తెలుస్తోంది. ఆ విషయాన్ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

కేసు పూర్వాపరాలు ఇవి. మార్చి 17న ముత్తు తల్లి తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ముత్తు మిత్రుల సెల్ నెంబర్లకు ఫోన్ చేసిన పోలీసులకు ముత్తు చెన్నైలోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. అతను తన స్నేహితుడు మాధవన్ తో కలిసి తిరుపతి వెళ్ళినట్టు కూడా తెలిసింది. తన మీద మిస్సింగ్ కేసు నమోదు అయితే టెన్షన్ పడి అసిన్ తన కుటుంబానికి డబ్బు ఇస్తుందని ముత్తు ఆశ పడినట్టు తెలుస్తోంది. అతడిని ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులు అసిన్ కు సంబంధించిన రహస్య సమాచారం కూడా పనిలో పనిగా రాబట్టినట్టు చెబుతున్నారు. రేపో ఎల్లుండో ముత్తును పోలీసుకు మీడియా ఎదుట హాజరు పరచవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X