CSK ఎంఎస్ ధోనికి విజయ్‌ను మించిన బిల్డప్.. తలైవా వీడియో ఊరమాస్ ట్రెండింగ్.. మీరు చూశారా?
ఇండియాలో సినిమాలు, క్రికెట్‌కు మాత్రమే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటోంది. అందుకే ఇక్కడి క్రికెటర్లు, సినిమా హీరోలను దేవుళ్లుగా కొలుస్తుంటారు. ముఖ్యంగా కొందరు ఆటగాళ్లను భారతదేశంలో విపరీతంగా అభిమానిస్తున్నారు.
అలాంటి వారిలో ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒకడు. అసాధారణ ఆటతీరు, నాయకత్వంతో ఎన్నో ట్రోఫీలను అందించిన అతడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ధోనీపై ఆ జట్టు ఓ వీడియో వదిలింది. అది మీరే చూడండి!

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్: ప్రపంచంలోనే అత్యంత ప్రభావాన్ని చూపించిన క్రికెట్ లీగ్‌లలో 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' ఒకటి. 2008లో మొదలైన ఇది ఇప్పటికే పదహారు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 17వ సీజన్‌ను మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మొదటి దశకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

యమా జోష్‌లోనే సీఎస్‌కే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎక్కువ ప్రభావాన్ని చూపించిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఒకటి. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తోన్న ఈ జట్టు ఇప్పటికే ఇందులో ఐదు సార్లు విజయాన్ని సాధించింది. అంతేకాదు, గత సీజన్‌లోనూ విజేతగా నిలిచి డిపెండింగ్ చాంపియన్‌గా 2024 ఐపీఎల్‌లో మరోసారి ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతుంది.

రంగంలోకి దిగిన తలైవా: మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగాడు. ఇప్పటికే అతడు తన ప్రాక్టీస్‌ను సైతం మొదలు పెట్టేశాడు. అంతేకాదు, ఈ సీజన్‌లో తాను కొత్త రోల్‌లో కనిపించబోతున్నట్లు ఇటీవలే చెప్పాడు. దీంతో ఈ సారి సీఎస్‌కే టీమ్‌లో అతడు ఏం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
ధోనీ కోసం స్పెషల్ క్లిప్: ఐపీఎస్ కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వినూత్నమైన ప్రచారంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా ప్రచారాన్ని ప్రారంభించేసిన ఆ జట్టు యాజమాన్యం.. తాజాగా ఎంఎస్ ధోనీపై ఓ స్పెషల్ వీడియోను ఎడిట్ చేయించింది. దీన్ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లియోగా ఎంఎస్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తాజాగా షేర్ చేసిన వీడియోను.. గత ఏడాది వచ్చిన 'లియో' సినిమా నుంచి ఎడిట్ చేయించింది. అందులో విజయ్ ఎంట్రీ సీన్ మాదిరిగానే ఇందులో ధోనీని చూపించారు. మొదట క్రేజీ హెయిర్ కట్‌తో ఉన్న తలైవాను.. ఒత్తైన జుట్టుతో ఉంటే ఎలా ఉంటాడు అనేది స్కెచ్ గీసినట్లు చూపించారు. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది.
ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా: తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షేర్ చేసిన ఎంఎస్ ధోనీ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. దీన్ని చూసి తలైవా అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. అదే సమయంలో విజయ్ ఫ్యాన్స్ సైతం ఈ వీడియోపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 'లియో' మూవీ రిఫరెన్స్‌తో ధోనీని చూడడం తమిళ తంబీలతో పాటు ఫ్యాన్స్ అందరినీ ఖుషీ చేసేస్తోంది.


Click it and Unblock the Notifications











