విశాల్‌కు ఆ అమ్మాయితో అక్రమ సంబంధం.. మహిళ అత్యుత్సాహం.. అరెస్ట్‌కు..!

దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం కొనసాగుతున్నది. అన్యాయానికి గురైన సీనీ తారలు.. తమపై దౌర్జన్యం చేసిన వ్యక్తులను బజారుకీడ్చుస్తున్నారు. గాయని చిన్మయి, హీరోయిన్ శృతిహరిహరన్ లాంటి వారు సినీ ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి నేపథ్యంలో హీరో విశాల్‌పై ఆరోపణలు చేసి ఓ యువతి సమస్యల్లో ఇరుక్కుపోయింది. అసలేం జరిగిందంటే..

 విశాల్‌పై చెన్నై మహిళ ఆరోపణలు

విశాల్‌పై చెన్నై మహిళ ఆరోపణలు

చెన్నైకి చెందిన విశ్వదర్శిని అనే మహిళ గోపాలపురంలోని నివాసి. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపింది. ఆ వీడియోలో విశ్వదర్శిని చెప్పినదేమంటే.. ఓ రోజు అర్దరాత్రి విశాల్ మా పక్కింటి వాళ్ల గోడ దూకాడు. ఆ ఇంటిలో ఉంటున్న ఓ 16 ఏళ్ల అమ్మాయితో రెండు మూడు గంటలు గడిపాడు అని తెలిపింది.

పొరుగింటి అమ్మాయితో అక్రమ సంబంధం

పొరుగింటి అమ్మాయితో అక్రమ సంబంధం

మా పొరుగింటిలోని అమ్మాయితో విశాల్‌కు అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఈ సీసిటీవీ ఫుటేజ్ అందుకు సాక్ష్యం అని విశ్వదర్శిని ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యువతి పోలీసులకు ఫిర్యాదు

యువతి పోలీసులకు ఫిర్యాదు

విశ్వదర్శిని వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో పదహారేళ్ల యువతి స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళలపై సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు విశాల్‌కు తప్పుడు సంబంధాన్ని అంటగట్టారని ఫిర్యాదుల్లో పేర్కొన్నది.

మహిళ తప్పుడు ఆరోపణలపై

మహిళ తప్పుడు ఆరోపణలపై

యువతి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు మహిళ చేసిన ఆరోపణలు తప్పని తేల్చారు. తప్పుడు ఆరోపణలు చేశారనే అంశాలతో విశ్వదర్శినిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోస్కో) కింద కేసు నమోదు చేశారు. విశ్వదర్శిని ఆచూకి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X