»   » నటి రాధకు నా భర్తతో అక్రమ సంబంధం,ఆయన్ను నాకు ఇప్పించండి

నటి రాధకు నా భర్తతో అక్రమ సంబంధం,ఆయన్ను నాకు ఇప్పించండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఓ మహిళ తన భర్తను నటి రాధ నుంచి రక్షించమని, విడిపించమని కోరుతూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు తమిళ సిని వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఆ కంప్లైంట్ లో తన నుంచి తన భర్తను విడతీసిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...సుందరం ట్రావెల్స్ చిత్రంలో నటించిన నటి రాధ బారి నుంచి తన భర్తను విడిపించాలని కోరుతూ స్థానిక కోడంబాక్కమ్, కామయరాజర్ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

అందులో ఆమె పేర్కొంటూ తన భర్త మునివేల్ సుందరాట్రావెల్స్ చిత్ర హీరోయిన్ రాధతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఈ విషయమై తాను స్థానిక విరుగమ్‌బాక్కమ్, టీ.నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పేర్కొంది.

అప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ వారు... తన భర్తను, నటి రాధను పిలిపించి విచారించి అనంతరం తన భర్తను తనతో పంపించార ని తెలిపింది. అయితే అప్పటి నుంచి నటి రాధ తన భర్తకు తరచూ ఫోన్ చేస్తూ తమ కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తోందని చెప్పుకొచ్చింది.

నటి రాధ ఫొటోలతో ...మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

వేరే వ్యక్తితో..

వేరే వ్యక్తితో..

అదే విధంగా తనకు వేరే వ్యక్తితో సంబంధం కలుపుతూ అసభ్యంగా మాట్లాడుతోందని చెప్పింది.

అంతేకాకుండా

అంతేకాకుండా

తన భర్తని ఆకట్టుకోవటమే కాకుండా.. తనను తన కూతురిని బెదిరిస్తోందిని పేర్కొంది.

కాలేజీకు సైతం

కాలేజీకు సైతం

దీంతో తన కూతురు ఆమెకు భయపడి నాలుగు రోజులుగా కాలేజ్‌కు కూడా వెళ్లడం లేదని తెలిపింది.

భర్త మిస్

భర్త మిస్

కొన్ని రోజులుగా తన భర్త కూడా కనిపించడం లేదని చెప్పింది. అందుకే కంగారుగా పోలీస్ కమీషనర్ దగ్గర కు వచ్చానని చెప్పింది.

పిర్యాదులో

పిర్యాదులో

నటి రాధ నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని, తన భర్తను ఆమె బారి నుంచి విడిపించి తనకు అప్పగించాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొంది.

ఆదేశాలు జారి

ఆదేశాలు జారి

ఉమాదేవి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్‌కమిషనర్ టీకే.రాజేంద్రన్ వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఈ కంప్లైంట్ ను

ఈ కంప్లైంట్ ను

ఈ ఫిర్యాదును టీ.నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పంపారు. వారు దీన్ని డీల్ చేస్తారు.

అవకాశం

అవకాశం

దీంతో అక్కడి పోలీసులు ఒకటి రెండు రోజుల్లో నటి రాధను పిలిపించి విచారించే అవకాశం ఉంది.

తననే మోసం

తననే మోసం

నటి రాధ ఇంతకు ముందొకసారి తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిందన్నది గమనార్హం.

చంపేస్తాడు

చంపేస్తాడు

తన భర్త చాలా మంచివాడని , ఆయన్ను చంపేస్తుందేమో అని భయం గా ఉందని తెలియచేసింది.

English summary
Umadevi complained against actress Radha (Sundaratravels movie fame) for detaining her husband at Chennai cop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu