twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతురు లవ్ స్టోరీ: స్టార్ డైరక్టర్ భార్య ఆత్మహత్యాయత్నం..

    By Srikanya
    |

    Cheran's wife makes suicide bid
    చెన్నై : తెరపై ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు కుటుంబం...అలాంటి ప్రేమ కథతోటే సతమతమవుతోంది. నా ఆటోగ్రాఫ్ వంటి ఎన్నో విభిన్న ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు చేరన్ కూతురు లవ్ స్టోరీ కూడా సినిమా కన్నా వేగంగా మలుపులు తిరుగుతోంది. ప్రియుడితోనే ఉంటానంటూ ఆయన కుమార్తె దామిని పట్టుబడుతోంది. రాత్రంతా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఆమె మాత్రం ప్రియుడే కావాలంటూ భీష్మించుకు కూర్చుంది. ప్రియుడు చంద్రు కూడా దామినితోనే జీవిస్తానంటూ మొండికేస్తున్నాడు. మరోవైపు తమ కుటుంబ పరువు బజారుకెక్కిందంటూ చేరన్ సతీమణి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

    వివరాల్లోకి వెళితే... దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న దర్శక నటుడు చేరన్ చిన్న కుమార్తె దామిని (20), సహాయ దర్శకుడు చంద్రుని ప్రేమిస్తున్నానంటూ భద్రత కోసం నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే తన తండ్రి చేరన్ తన ప్రియుడు చంద్రుని హతమార్చేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ కమిషనర్ శివకుమార్, సహాయ కమిషనర్ శ్యామలా దేవీ రాత్రి చేరన్ దంపతుల వద్ద విచారణ చేపట్టడంతో పాటు రాత్రంతా దామినికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

    మరో ప్రక్క కుమార్తె ప్రేమ వ్యవహారంతో మనస్తాపానికి గురైన చేరన్ సతీమణి సెల్వరాణి రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భర్తపై కన్నకూతురే ఫిర్యాదు చేయడంతో తనకు తాను కత్తితో పొడుచుకునేందుకు యత్నించిందని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పినట్టు సమాచారం. అనారోగ్యం బారిన పడినట్లు పేర్కొంటూ స్థానిక రాజాఅన్నామల్లైపురంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం సెల్వరాణిని కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం అధిక రక్తపోటుతో బాధపడుతున్న సెల్వరాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

    ఈ విషయమై చేరన్ వివరణ ఇస్తూ .. తన కుమార్తె ప్రేమ వ్యవహారానికి తానెప్పడూ అడ్డు చెప్పలేదన్నారు. చంద్రూ ప్రవర్తన మంచిది కాకపోవడంతోనే జాగ్రత్తపడినట్లు తెలిపారు. అవగాహన లేకపోవడం వల్లే తనపై తన కుమార్తె ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రుపై జరిగిన దాడికి తనకే సంబంధం లేదని, అవసరమైతే పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేయవచ్చన్నారు. తన కుమార్తెకు ప్రాణహాని ఉన్నందున ఆమెకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటుగా దర్శకులు అమీర్, సముద్రకని, నటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి కూడా ఉన్నారు. దర్శకుడు చేరన్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ఓ విజ్ఞప్తి లేఖను అందించారు.

    ఇక మహిళా పోలీసులు దామినిని తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె ప్రియుడు చంద్రుకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అతను కూడా దామిని నుంచి తనని విడదీయవద్దంటూ పోలీసులను బతిమాలినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ... దామిని మేజర్ అయిన కారణంగా ఆమెపై ఒత్తిడి తీసుకురాలేమన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చామని, ఆమెదే తుది నిర్ణయమన్నారు.

    English summary
    Selvarani, wife of actor-director Cheran, attempted suicide. She was hopitalised immediately and is under medication. She took the extreme decision a day after her daughter accused Cheran of threatening an assistant director she was in love with. It is said Selvarani was upset with daughter Damini for filing a police complaint against Cheran. Before submitting a petition at the Police Commissioner's office, along with her lover Chandru's sister Gowri, Damini said: 'My lover is being threatened by my father. If anything happens to him, my father should be held responsible.' A resident of Choolaimedu, Chandru regularly visited Cheran's office to assist him in office work during the release of films. Damini met him at a function and fell in love.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X