twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ నాట మళ్లీ రచ్చ.. రాధారవిపై పోటీకి దిగిన చిన్మయి

    |

    ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన 'మీటూ' ప్రకంపనలు మన దేశంలోనూ వ్యాప్తి చెందాయి. తనూశ్రీ దత్తా నానా పటేకర్‌పై ఆరోపణలు చేయడంతో మీటూ ఊపందుకోగా.. దక్షిణాదిన చిన్మయి శ్రీపాద అందరి దృష్టిని ఆకర్షించింది. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్‌. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచింది.

    సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..

    సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..

    ‘మీటూ' ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టింది. అంతేకాకుండా ఎంతో మంది బాధితుల సంఘటనలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రపంచానికి చాటి చెప్పింది.

     వైరముత్తు, రాధా రవిలపై..

    వైరముత్తు, రాధా రవిలపై..

    వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎందరికో ఓ గొంతుకగా నిలిచింది. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్‌ యూనియన్‌ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షిక రుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్‌ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ పదవిలో రాధారవి ఉన్నాడు.

    కోర్టు చుట్టూ..

    కోర్టు చుట్టూ..

    సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్‌ ఆర్డర్‌ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్‌ యూనియన్‌ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్‌ కెరీర్‌ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది.

    రాధారవిపై పోటీ..

    రాధారవిపై పోటీ..

    మరోసారి ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్‌ పదవికి నామినేషన్‌ వేసింది చిన్మయి. సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్‌ యూనియన్‌ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?' అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించగా..‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్‌లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది' అని ఘాటుగా తిప్పి కొట్టింది చిన్మయి.

    English summary
    Chinmayi Contest Opposite Radha Ravi In Dubbing Union ELection. Chinmayi Sripaada, who was banned from the Dubbing Union is now contesting for the President post against Radha Ravi in the upcoming election.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X