అయ్యప్ప భక్తులను టెంప్ట్ చేయొద్దు : యేసుదాస్.. నీ భక్తుల నుంచి కాపాడు: చిన్మయి
శబరిమలలో మహిళల ప్రవేశం.. ఇది ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శబరిమల కట్టుబాట్లు, అక్కడి సంప్రదాయాలను మంటగలపొద్దు.. మహిళలు అక్కడికి రావొద్దని అయ్యప్ప భక్తులు అంటుంటే.. ఆ వివిక్ష ఎందుకు? తాము గుడిలోకి ఎందుకు ప్రవేశించకూడదు? అంటూ కొందరు మహిళమణులు నిరసనలు, ఉద్యమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎంత వద్దని వారించినా కొందరు మాత్రం గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

స్పందించిన యేసుదాస్..
అయ్యప్ప పాటలకు ఫేమస్ అయిన యేసుదాస్.. ఆయనకు భక్తుడే. హరివరాసాణం అనే పాట లేనిదే అయ్యప్ప పూజలు జరగవు. రోజూ అక్కడి గుడిలో కూడా ఈ పాట మార్మోగుతూనే ఉంటుంది. అంతటి ప్రాచుర్యం పొందిన యేసుదాస్.. ఈ అంశంపై స్పందించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భక్తుల శ్రద్ద, ఆలోచనలు పక్కకు..
శబరిమలలో మహిళలు ప్రవేశిస్తే.. అయ్యప్ప భక్తుల ఆలోచన, శ్రద్ద పక్కకు జరిగే అవకాశం ఉంటుందని అందుకే వారు అక్కడికి వెళ్లొద్దని తెలిపాడు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ అందమైన అమ్మాయిలు నేటి ఆదునిక వస్త్రాధారణతో శబరిమలకు వెళితే అయ్యప్ప కళ్లు తెరిచి చూడడు. కానీ మిగతా భక్తుల దృష్టి మారొచ్చు. అందుకే వారిని అక్కడికి రావొద్దని అంటున్నాము. వారు వెళ్లగలిగే దేవాలయాలెన్నో ఉన్నాయి.. అక్కడికి వెళ్లొచ్చు.
అంతా మారిపోయింది..
ప్రస్తుతం అంతా మారిపోయింది.. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు.. కొన్ని దశాబ్దాల క్రితం మండలంలో ఉన్న రోజులు తన భార్యను కూడా కన్నెత్తి చూడకపోయేవారు.. ఆ పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి.. దయచేసి అయ్యప్ప భక్తులను టెంప్ట్ చేయొద్దు నేను అదొక్కటే కోరుతున్నాన'నంటూ చెప్పుకొచ్చారు.

కాపాడు అయ్యప్ప..
ఇక ఇలాంటి మహిళ వ్యతిరేక వ్యాఖ్యలు ఎక్కడ వినపడినా వచ్చి వాలే మహిళ చిన్మయి. ప్రముఖ సింగర్ చిన్మయి గతకొంత కాలంనుంచి మీటూ ఉద్యమం, మహిళా సాధికారత వంటి అంశాలపై గళమెత్తుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా యేసుదాస్ చేసిన కామెంట్స్‌పైనా చిన్మయి సెటైర్లు వేసింది. ‘డియర్ అయ్యప్ప.. మీ భక్తుల నుంచి నన్ను కాపాడండి' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం చిన్మయి వేసిన ఈ సెటైర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











