twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    *** ఫోటోలను పంపుతూ సింగర్ కార్తీక్ వేధించేవాడు.. మనోపైనా చిన్మయి సంచలన వ్యాఖ్యలు

    |

    మీటూ ఉద్యమం చల్లారినట్టు కనిపించినా.. చిన్మయి మాత్రం పట్టును వదలడం లేదు. అన్యాయం చేసిన వారిని, ఆడవారిని వేధించినవారిపై తన పోరును ఆపడం లేదు. ఎప్పుడూ ఏదో రకంగా వారి బండారాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మగవారి చేతిలో మోసపోయిన అమ్మాయిలకు గొంతుకై ప్రపంచానికి వినిపిస్తోంది. ఈ క్రమంలో తనకు ఎన్ని బెదిరింపులు ఎదురైనా బయపడకుండా ముందుకు సాగుతూనే ఉంది.

    తాజాగా డబ్బింగ్ యూనియన్..

    తాజాగా డబ్బింగ్ యూనియన్..

    గతవారం జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు ఎంతటి వివాదాంగా మారాయో అందరికీ తెలిసిందే. రాధారవికి పోటీగా నిల్చున్న చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలు ఏకగ్రీవం చేశారు. తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారు, రాధారవి ఎన్నిక చెల్లదంటూ..దీనిపై కోర్టుకు వెళ్తానంటూ చిన్మయి ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

    నాటి సంఘటనను..

    నాటి సంఘటనను..

    రాధారవిపై, వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన చిన్మయిని కోలీవుడ్ దూరంపెట్ట సాగింది. ఈ క్రమంలోనే డబ్బింగ్ యూనియన్‌లో చందా కట్టడం లేదని, గడువు ముగిసిందనే నెపంతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. అదే సమయంలో సింగర్ కార్తీక్‌పైనా మీటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.

    వివరణ ఇచ్చుకున్న కార్తీక్..

    వివరణ ఇచ్చుకున్న కార్తీక్..

    మీటూ ఉద్యమం ఊపందుకున్న ఆ సమయంలో సింగర్ కార్తీక్‌పైనా పలువురు ఆరోపణలు చేశారు. మానసికంగా వేధించేవాడంటూ, అసభ్యకర సందేశాలు పంపించేవాడంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తాను అలాంటి వాడిని కాదని, ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు.

    తాజాగా డబ్బింగ్ యూనియన్‌లోకి..

    అయితే తాజాగా డబ్బింగ్ యూనియన్‌లోకి కార్తీక్ చేరాడని సోషల్ మీడియాలో పేర్కొంటూ.. నాడు జరిగిన సంఘటనను రాసుకొచ్చింది. ఈ క్రమంలో మరో సింగర్ మనోను టార్గెట్ చేసింది. ఈ మేరకు చిన్మయి ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది.

     కాంప్రమైజ్‌కు పిలిచారు..

    కాంప్రమైజ్‌కు పిలిచారు..

    ఈ మేరకు ట్వీట్ చేస్తూ... 'కార్తీక్‌పై ఆరోపణలు చేసిన అమ్మాయిలందర్నీ పిలవమని మనో నాతో చెప్పారు. అందర్నీ తీసుకుని మా ఇంటికి రా అని మనో చెప్పగానే.. న్యాయం చేస్తారేమో అనుకున్నాను.. కానీ కాంప్రమైజ్‌కు పిలిచారు. ఈ స్థాయికి రావడానికి నువ్వూ చాలా కష్టపడ్డావు.. అతనూ చాలా కష్టపడ్డాడ'ని అన్నట్లు చిన్నయి పేర్కొంది.

    సింగర్‌గా గౌరవిస్తాను..

    సింగర్‌గా గౌరవిస్తాను..

    అవును నిజమే అది నేనూ ఒప్పుకుంటాను. సంగీత ప్రపంచంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కార్తీక్‌ను గాయకుడిగా గౌరవిస్తాను.. అయితే నేనూ ఈ స్థాయికి వచ్చాక నా స్టేటస్, పవర్‌ను ఇతరులను వేధించడానికి ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది.

    ఆ ఫోటోలను పంపుతూ..

    ఆ ఫోటోలను పంపుతూ..

    డిక్ పిక్స్ పంపుతూ ఎంతోమంది ఆడవారిని వేధించిన సింగర్ కార్తీక్‌ను కాపాడటానికి మనో తన పలుకుబడిని ఉపయోగించారు. ఎవరు గౌరవించడానికి అర్హులనే గొప్ప పాఠాన్ని ఈ ఏడాదిన్నర కాలంలో తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. వారు గొప్ప గాయకులే కావచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు.. అయితే వారు గొప్ప మగవారు కాదు.

    English summary
    Chinmayi Me Too Allegations On Karthik About Sending Pics. She Fires On Mano Tries To Compromis This Issue Instead Of Doing Justice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X