క్షమాపణ చెప్పాలా.. చట్టపరంగానే తేల్చుకుంటా.. వెనక్కి తగ్గని చిన్మయి

గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో జరుగుతున్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు ఎంత రచ్చగా మారాయన్న విషయం అందరూ చూశారు. డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ అధ్యక్షుడు రాధారవికి పోటీగా సింగర్ చిన్మయి శ్రీపాద నిలబడటం, ఆమెను సభ్యత్వాన్ని రద్దు చేయడం, రాధారవిని ఏకగ్రీవం చేయడం, దీనిపై చిన్మయి పోరాటం చేస్తుండటం ఎంత వైరల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. మళ్లీ తాజాగా వీరిద్దరి మధ్య మాటల యుద్దం మొదలైంది ఆ కథేంటో ఓ సారి చూద్దాం.

ఏకగ్రీవంగా రాధారవి..

ఏకగ్రీవంగా రాధారవి..

చిన్మయి చేసిన మీటూ ఆరోపణలకు గానూ వార్షిక చందా చెల్లించలేదన్న నెపంతో ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పించారు. అయితే వారం క్రితం జరిగిన డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా నిలబడింది. అయితే ఆమెకు సభ్యత్వం లేదని, నామినేషన్‌ను రద్దు చేసి, రాధారవి ఎన్నికను ఏకగ్రీవం చేశారు. దీనిపై చిన్మయి ఫైర్ అవుతూ కోర్డును ఆశ్రయించింది.

పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..

పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..

చిన్మయి పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఇది అన్యాయం అంటూ చిన్మయి మరోసారి అప్పీల్‌ చేయడానికి సిద్ధమైంది. సోమవారం నాడు మళ్లీ రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు తెలిపింది.

డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలక్షన్స్..

డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలక్షన్స్..

కాగా శనివారం డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను రద్దుకు గురి కావడంతో నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో ఇతర పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు.

క్షమాపణలు చెబితే..

క్షమాపణలు చెబితే..

ఈ సందర్భంగా నటుడు రాధారవి మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి క్షమాపణ చెబితే ఆమెను తిరిగి యూనియన్‌లోకి చేర్చుకుంటామని అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ కోరడం లాంటిది చేయనని, తాను చట్టపరంగానే వెళ్తానని చిన్మయి తెగేసి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X