కమల్ హాసన్-రేఖ వివాదం.. సెట్‌లో అలా ప్రవర్తించే శాడిస్ట్‌లు.. చిన్మయి సంచలన కామెంట్స్

కమల్ హాసన్ తన అనమతి లేకుండా షూటింగ్‌లో భాగంగా ముద్దు పెట్టాడని అలనాటి తమిళ నటి సీనియర్ హీరోయిన్ రేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే లేపింది. అప్పుడెప్పుడో జరిగిన ఆ సంఘటనకు కమల్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఆ సమయంలో హీరో కమల్ హాసన్, దర్శకుడు కే బాలచందర్ గారి తనకు క్షమాపణ చెప్పలేదని తెలుపుతూ.. ఇప్పుడు చెప్పినా పర్లేదు.. చెప్పకపోయినా పర్లేదంటూ తెలిపింది. అయితే తన బాధ అంతా.. ఆ సమయంలో తన గురించి, ఆ సీన్ గురించి మాట్లాడుకున్న జనాల గురించేనని, అదే చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి విషయాల్లో స్పందించాడనికి ఎప్పుడూ ముందుంటుంది వీరనారి చిన్మయి శ్రీపాద.

మీటూ ఉద్యమంలో పోరు..

ఒకప్పుడు చిన్మయి శ్రీపాద అంటే సమంత గొంతో లేదా చక్కటి పాటలో గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు మాత్రం చిన్మయి అంటే మీటూ ఉద్యమం, వైరముత్తు, రాధారవి మాత్రమే గుర్తుకు వస్తారు. మీటూ ఉద్యమంలో భాగంగా తనను వేధించారని వైరముత్తు, రాధారవిలపై ఆరోపణలు చేయడం.. ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి బహిష్కరించడం ఇక ఆ కథ అంతా అందరికీ తెలిసిందే.

అలాంటి శాడిస్ట్‌లు..

అలాంటి శాడిస్ట్‌లు..

కమల్ హాసన్-రేఖ ఘటనలోనూ చిన్మయి దూరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూనే ఉంది. ఈ క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. హీరోయిన్ల చెంపలు వాచిపోయేలా కొట్టి దాన్ని గర్వంగా చెప్పుకునే దర్శకులు కూడా ఉన్నారని, సెట్‌లో ఆడవారిని శారీరకంగా హింసించే, కొట్టే శాడిస్ట్‌లు ఉన్నారని అదంతా ఓ పవర్ గేమ్ అంటూ విరుచుకుపడింది.

అందులో ఆశ్చర్యమేమీ అనిపించలేదు..

అందులో ఆశ్చర్యమేమీ అనిపించలేదు..

‘మగవాళ్లు ఎంత తప్పుగా ప్రవర్తించినా ఏమీ కానట్టు ఉండాలని చిన్నప్పటి నుంచే ఆడవాళ్లను ఆ మైండ్‌ సెట్‌తో పెంచుతారు. అందుకే షావుకారు జానకిలాంటి వాళ్లు మీటూ ఉద్యమాన్ని చిన్నచూపు చూసి మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేద'ని రాసుకొచ్చింది.

నవ్వుతూనే చెప్పుకొచ్చింది..

నవ్వుతూనే చెప్పుకొచ్చింది..

‘రేఖ గారు తనకు ఎదురైన అనుభవాన్ని నవ్వుతూనే చెప్పారు. ఎందుకంటే మళ్లీ ఎవరైనా తనను వేలెత్తి చూపుతారేమోనన్న భయంతో. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడవాళ్లు ఇదంతా సాధారణమే అన్నట్లుగా ఎలా అణిగి మణిగి ఉంటారో చూసారా' అంటూ వారిపైనా కౌంటర్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X