twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన లైంగిక వేధించారని అన్నందుకే.. గాయని చిన్మయి ఝలక్.. కోర్టులో పిటిషన్..!

    |

    Recommended Video

    Singer Chinmayi Sripada Approaches Court For Justice || Radha Ravi || Filmibeat Telugu

    గాయని చిన్మయి శ్రీపాదకు చేదు అనుభవం ఎదురైంది. డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ నుంచి చిన్మయిని తొలగించడం తమిళ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. గతంలో మీ టూ ఉద్యమంలో భాగంగా డబ్బింగ్ యూనియన్ ప్రసిడెంట్ రాధారవిపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ప్రతీకారం తీర్చుకొన్నారా అనే వాదన కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

    డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగింపు

    డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగింపు

    రెండేళ్ల కాల పరిమితి కోసం సౌతిండియన్ సినీ టెలివిజన్ ఆర్టిస్ట్ డబ్బింగ్ యూనియన్‌కు చెల్లించాల్సిన ఫీజును చెల్లించనందున సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చిన్మయికి గత నవంబర్‌లో నోటీసులు పంపారు. దీంతో చిన్మయి షాక్‌కు గురయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించారు.

    మద్రాస్ హైకోర్టు జోక్యంతో

    మద్రాస్ హైకోర్టు జోక్యంతో

    తన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై సవాల్ చేస్తూ మార్చి 15న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో డబ్బింగ్ యూనియన్ నిర్ణయంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. చిన్మయి దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 25వ తేదీలోగా స్పందించాలని రాధారవికి నోటీసులు జారీచేసింది.

    ఆ రెండే ముఖ్యం: పుట్టినరోజున RRR గురించి అలియా భట్ హాట్ కామెంట్ఆ రెండే ముఖ్యం: పుట్టినరోజున RRR గురించి అలియా భట్ హాట్ కామెంట్

    న్యాయపోరాటం చేస్తామని

    మద్రాస్ హైకోర్టు వెల్లడించిన మధ్యంతర ఉత్తర్వుల అనంతరం చిన్మయి మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. రాధారవి 25 తేదీ లోపు స్పందించాల్సి ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే విషయంపై వచే చూడాల్సిందే. డబ్బింగ్ యూనియన్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం అని అన్నారు.

    నాపై కక్ష సాధింపు చర్య అని

    నాపై కక్ష సాధింపు చర్య అని

    డబ్బింగ్ యూనియన్ తనపై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నది. క్షమాపణ లెటర్‌తోపాటు రూ.1.5 లక్షలు చెల్లించాలని నోటీసులు పంపింది. గతంలో రూ.2500 చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకొన్నాను. అయితే రూ.5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దానికి రశీదు కూడా ఇవ్వలేదు అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. రాధారవిపై ఆరోపణలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయని చిన్మయి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిపారు.

    English summary
    In November 2018, singer and dubbing artist Chinmayi Sripaada was banned from the Union for non-payment of subscription fees for a prolonged period of two years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X