ఈ సారి అతడి చెంప చెళ్లుమనిపిస్తా.. గాయని చిన్మయి వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రముఖ సినీ రచయిత వైరముత్తుపై గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి లైంగిక ఆరోపణలు చేయడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. పదేళ్ల క్రితం నన్ను లైంగిక వేధించారంటూ చేసిన ఆరోపణలను సినీ ప్రముఖులను నివ్వెరపాటుకు గురిచేశాయి. ఓ కార్యక్రమం కోసం విదేశాలకు వెళితే నన్ను గదిలోకి రమ్మన్నాడని చిన్మయి చెప్పిన మాటలు సంచలనం రేపాయి.

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కాంగ్రెస్ నేత కుష్బూ చెంప చెల్లుమనిపించారు. ఆ వీడియోను ఓ వ్యక్తి చిన్మయికి ట్వీట్ చేశారు. ఈ వీడియో మీ కోసమే.. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి కుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు' అని పేర్కొన్నారు. ఆ వీడియోను చూసి చిన్మయి స్పందిస్తూ.. కచ్చితంగా మీ సూచనలు పాటిస్తాను. ఈ సారి వైరముత్తు కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తాను అని చిన్మయి కామెంట్ చేశారు. అలా చేస్తేనే నాకు న్యాయం జరుగుతుందనిపిస్తుంది అని అన్నారు.
లైంగిక ఆరోపణల నేపథ్యంలో చిన్మయిని పలువురు నిలదీశారు. పదేళ్ల క్రితమే వైరముత్తుపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నావని ఆమెను నిలదీశారు.


Click it and Unblock the Notifications











