చిరు మెచ్చిన ఎటిఎమ్
చెన్నయ్ లో గడిపినన్నాళ్లు చిరంజీవి తమిళ సినిమాలు బాగానే చూశాడు. తొలుత రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన పొల్లదవన్ సినిమాను దేవిశ్రీదేవి థియేటర్ లో ప్రివ్యూ వీక్షించాడు. ఆ తరువాత చిరంజీవి ఎటిఎమ్ సినిమా కూడా వీక్షించాడు. తమిళం తెలిసిన చిరంజీవికి ఎటిఎమ్ సినిమా బాగా నచ్చిందట. ఈ సినిమా కథ బాగుందని మెచ్చుకున్నాడట. ఇంకో విషయం ఏమంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శ్రీకాంత్ చేసిన పాత్ర పేరు ఎటిఎమ్. ఎటిఎమ్ చేసే విన్యాసాలు నవ్వు తెప్పించడమే కాకుండా కలకాలం గుర్తుండిపోయే పాత్రే కదా. ఇపుడు అదే పేరుతో తమిళంలో రూపొందిన సినిమా దీపావళికి విడుదలై విజయవంతంగా నడుస్తోంది.


Click it and Unblock the Notifications











