రాధిక, చిరంజీవి కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే చనువుతో ఆమె రామ్ చరణ్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు అడుగుతున్నట్లు సమచారం. తాజాగా ఆమె తెలుగులో తన రాడాన్ సంస్ధ ద్వారా పంపిణీ రంగంలోకి దూకటానికి ప్రయత్నాలు చేస్తుంది. మొదటి చిత్రమే ఓ క్రేజీ చిత్రం తీసుకుంటే ఒక్క సారిగా తమ సంస్ధ పేరు అంతటా నానుతుందని ఆమె భావిస్తోందని సమాచారం. ఇక రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మగధీర పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే దాదాపు అన్ని ఏరియాలు తమ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారానే మార్కెట్ చేయాలని యోచిస్తున్నారు. కానీ ముప్పై కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఈ సినిమాకు టేబుల్ ప్రాఫెట్ తో ఆఫర్ వస్తే ఆలోచించే అవకాశమున్నట్లు చెప్తున్నారు. అలాగే ఇప్పటికే రాధిక సీరియల్ నిర్మాతగా, సినిమా నిర్మాతగా, నటిగా ఆమె పరిశ్రమలో వెలుగుతోంది.