ఆ హీరోనే అధ్బుతమైన డాన్సర్: ప్రభుదేవా
ప్రభుదేవా రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఇండియాలో తనకు అత్యంత ఇష్టమైన డాన్సర్ ఓ తెలుగు హీరో అని చెప్పాడు. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయమై మాట్లాడుతూ..చిరంజీవికి కొరియోగ్రఫి చేసేటప్పుడు ఆశ్చర్యానికి లోనవతూంటాను. ఆయన ఓ అధ్బుతమైన డాన్సర్. ఆయన నృత్యరీతులు మమ్మల్నే మిస్మరైజ్ చేస్తూంటాయి. ఆయనలో దాగిఉన్న ఆ హిడెన్ టాలెంట్ ని డిఫైన్ చేయటం కష్టమే. తాజాగా ప్రభుదేవా అల్లు శిరీష్ స్టార్ట్ చేసిన సౌత్ స్కోప్ స్టైల్ అవార్డులలో స్టైలిష్ కొరియోగ్రాఫర్ అవార్డును అందుకున్నాడు. ఇక చివరగా ప్రభుదేవా చిరంజీవికి ఓ రిక్వెస్ట్ చేసారు. ఆయన డాన్స్ ని ఆపకూడదని, కంటెన్యూ చేయాలని, ఆడియన్స్ కి ఆనందాన్ని అందించాలని అన్నారు. కరెక్టే కదా..చిరంజీవి లాంటి గ్రేట్ డాన్సర్...కాస్త సినిమాల్లో నటిస్తూ..డాన్స్ లతో అలరిస్తూంటే బావుంటుంది కదా. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ చిత్రానికి పనిచేసారు.


Click it and Unblock the Notifications











