Chithha Movie First Review గుండెల్ని ఎమోషన్స్‌తో పిండేసే మూవీ.. సిద్దార్థ్ కమ్ బ్యాక్ మూవీ..!
నటీనటులు: సిద్దార్థ్, నిమిషా సజయన్ తదితరులు
దర్శకత్వం: ఎస్‌యూ అరుణ్ కుమార్
నిర్మాతలు: హరి ప్రసాద్, రాజ్ గోపాల్, సిద్దార్థ్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), దిబూ నినన్ థామస్
సినిమాటోగ్రఫి: బాలాజీ సుబ్రమణ్యం
ఎడిటింగ్: సురేష్ ప్రసాద్
ఆర్ట్: సీఎస్ బాలచందర్
రిలీజ్ డేట్: 2023-09-28
చితా మూవీ ఎమోషనల్, మదిని కలిచివేసే, ఆలోచనలు రేకెత్తించే చిత్రం. హృదయానికి దగ్గరయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు హృదయానికి హత్తుకొనేలా నటించారు. ఇలాంటి సినిమాను ఎంపిక చేసుకొన్నందుకు సిద్దార్థ్‌కు హ్యాట్సాఫ్. కంగ్రాట్స్ అరుణ్ కుమార్ బ్రో.. మీ సినిమాలంటే నాకు ఎప్పుడూ ఇష్టమే అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

చిత్తా లాంటి సినిమా కథను ఇప్పటి వరకు ఏ తమిళ సినిమా కూడా చూపించలేదు. ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ మాత్రమే కాదు.. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందంచారు. సిద్దార్థ్ ఫెర్ఫార్మెన్స్ బెస్ట్. ఈ సినిమాలో నటించిన ఇద్దరు బాల నటులు అద్బుతంగా నటించారు. రచయిత, దర్శకుడు అరుణ్ కుమార్ పవర్‌ఫుల్ సినిమాతో షాకిచ్చారు. ఈ సినిమా చాలా కాలం ప్రేక్షకులను వెంటాడుతుంది. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా అని సినీ విమర్శకుడు రమేష్ బాలా ట్వీట్ చేశారు.
చితా చిత్రం విభిన్నమైన చిత్రం. పోర్ తోజిల్, రాట్సాసన్ తరహా చిత్రం. ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే, అద్బుతమైన సందేశంతో రూపొందించిన సినిమా. ఒక క్రైమ్ ఎలిమెంట్‌తో వచ్చే సినిమా థ్రిల్‌ను మాత్రమే ఇవ్వడం కాదు.. చాలా అవేర్‌నెస్ కలిగించాలి. పిల్లలు, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన చిత్రం అని నేను రికమెండ్ చేస్తాను అని రాజశేఖర్ అనే క్రిటిక్ ట్వీట్ చేశారు.

చితా హృదయాన్ని కలిచివేసే ఎమోషనల్ థ్రిల్లర్. టన్నుల కొద్ది ఇటుకలతో కొట్టే దెబ్బ మాదిరిగా ఉంది. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు సినిమా కట్టిపడేస్తుంది. సినిమాలో డ్రామా ఎమోషనల్‌గానే కాకుండా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇస్తుంది. సిద్దార్థ్ కమ్ బ్యాక్ సినిమా అని గట్టిగా చెబుతున్నాను అని క్రిటిక్ చెప్పారు.


Click it and Unblock the Notifications











