twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయంకరమైన, దూకుడు స్వభావం గల పాత్రలో విక్రమ్

    |

    చియాన్ విక్రమ్ నటించిన తమిళ చిత్రం కొడరమ్ కొండన్(తెలుగులో మిస్టర్ కెకె) ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్‌తో రన్ అవుతోంది. విక్రమ్ నెక్ట్స్ మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమా చేయబోతున్నాడు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ లెజెండరీ ఎపిక్ డ్రామా రూపొందబోతోంది. ఇందులో విక్రమ్.. ఆదిత్య కరికాలన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

    'పొన్నియిన్ సెల్వన్' మూవీలో తన పాత్రకు తగిన విధంగా విక్రమ్ ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి స్పందిస్తూ మణిరత్నం చెప్పిన కథ తనకు ఎంతో నచ్చిందని, ఇందులో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.

    Chiyaan Vikram about Ponniyin Selvan

    మణిరత్నం నాకు ఈ కథ, అందులో నా పాత్ర గురించి చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. భయంకరమైన, దూకుడు స్వభావంగల పాత్ర. ఇందుకోసం నేను కొంచెం బాడీ కూడా పెంచాల్సి ఉందని విక్రమ్ వెల్లడించారు.

    ఒక రకంగా చెప్పాలంటే ఒక మృగం లాంటి పాత్ర చేస్తున్నాను, ఇలాంటి భిన్నమైన పాత్ర కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అయితే ఇది విలన్ పాత్ర కాదు, కానీ విలనిజానికి ఏమాత్రం తక్కువకాని క్యారెక్టర్. ఇలాంటి విభిన్నమైన పాత్ర చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, ఇన్నాళ్లకు నేను కోరుకున్న పాత్ర చేసే అవకాశం వచ్చిందని విక్రమ్ తెలిపారు.

    English summary
    Chiyaan Vikram now gearing up for his next film Ponniyin Selvan in Mani Ratnam direction. Vikram said that the script of Ponniyin Selvan excited him to the core. He said, "When Mani Ratnam narrated me the script and told me about the outline of the character and I was like 'Wow'. It is very intense, fierce, aggressive kind of role for which I have to build a little more body and looks have to be changed."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X