నిర్మాతల బోల్డ్ డెసిషన్.. కోబ్రాకు కత్తెర.. డేమేజ్ కంట్రోల్ అవుతుందా?

విలక్షణ నటుడు, చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా చిత్రం బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే విక్రమ్ నటన, అజయ్ టేకింగ్​కు ప్రశంసలు దక్కినా.. ఓవరాల్​గా సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన లభించింది. దీనికి ప్రధాన కారణం సినిమా నిడివి అని తెలుస్తోంది. ఇప్పటికే రన్​టైమ్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులు.. వివిధ సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో త్వరగానే నష్ట నివారణ చర్యలు చేపట్టింది చిత్రబృందం.

2022లో విడుదలైన తమిళ సినిమాల్లో తొలి రోజు కలెక్షన్ల పరంగా నాలుగో స్థానంలో నిలిచింది కోబ్రా. విక్రమ్ కెరీర్​లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా అవతరించింది. అయితే నిడివి విషయంలో మాత్రం రిలీజ్​ రోజు ప్రేక్షకుల సహనానికి.. కోబ్రా పరీక్ష పెట్టిందని సమాచారం. విడుదల సమయానికి ఈ సినిమా రన్​టైమ్​ 3 గంటల 3 నిమిషాల 3 సెకండ్లుగా ఉంది.

Chiyaan Vikrams Cobra run time trimmed by 20 Minutes after mixed reviews from the audience

ఈ క్రమంలోనే ప్రేక్షకులను సంతృప్తి పరచడం సహా విజయవంతమైన ప్రదర్శన కోసం ఓ బోల్డ్ డెసిషన్ తీసుకుంది చిత్రబృందం. సినిమా నిడివికి కత్తెర వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రన్​టైమ్​ను 2 గంటల 40 నిమిషాలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో గురువారం సాయంత్రం నుంచే ఈ ట్రిమ్​డ్​ వెర్షన్​ను చూసేయొచ్చని తెలిపింది.

కోబ్రాలో విక్రమ్ సరసన కేజీయఫ్ ఫేమ్ శ్రీనిద్ధి శెట్టి హీరోయిన్​గా నటించింది. మృణాళిని రవి, రోషన్ మ్యాథ్యా, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మాత. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమాకు బ్యాక్​గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. నిడివి తగ్గడం కోబ్రాకు ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X