కొడుకుతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విక్రమ్.. ఇప్పుడైనా హిట్టు కొడతాడా?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సక్సెస్ అందుకొని చాలా కాలమవుతోంది. ఎన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. దర్శకులను మార్చినా జానర్స్ ని మార్చినా కూడా సక్సెస్ దక్కడం లేదు. సినిమాల కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టె విక్రమ్ కి సక్సెస్ రాకపోవడం ఏమిటని గతకొంత కాలంగా తెలుగు ఆడియేన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇకపోతే ఫైనల్ గా విక్రమ్ తన కొడుకుతో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆ సినిమాతోనే..

ఆ సినిమాతోనే..

విక్రమ్ తమిళ్ ఆడియేన్స్ కి ఎంత ఇష్టమో తెలుగు ఆడియెన్స్ కి కూడా అంతే ఇష్టం. అపరిచితుడు సినిమాతో తెలుగు ఆడియేన్స్ కి విక్రమ్ బాగా దగ్గరయ్యాడు. అయితే అతని సినిమాలు ఒక్కప్పటిలా సక్సెస్ కావడం లేదు. అందుకు కారణం విక్రమ్ సరైన కథలను ఎంచుకోవడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

కొడుకుతో కొత్త సినిమా..

కొడుకుతో కొత్త సినిమా..

ఫైనల్ గా విక్రమ్ తన కొడుకుతో ఒక మంచి యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. విక్రమ్ తనయుడు ధృవ్, ఆదిత్య వర్మ సినిమాతో తమిళ్ తెరకు సాలీడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ధృవ్ తన తండ్రీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య వర్మ టైమ్ లోనే వీరు మల్టీస్టారర్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి డైరెక్టర్ కూడా సిద్ధమయ్యాడు.

విక్రమ్ కోబ్రా..

విక్రమ్ కోబ్రా..

రజినీకాంత్ తో పేట సినిమాను తెరకెక్కించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఇటీవల విక్రమ్ కి ఒక స్క్రిప్ట్ వినిపించగా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. విక్రమ్ కి ఇది 60వ సినిమా కాగా ధృవ్ కి రెండవ సినిమా. కెరీర్ స్టార్టింగ్ లోనే ధృవ్ తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అనగానే ఒక్కసారిగా తమిళనాడులో ఈ వార్త వైరల్ గా మారింది. బారి బడ్జెట్ లో యాక్షన్ ఫిల్మ్ గా విక్రమ్ 60ని రూపొందించే ఛాన్స్ ఉందట.

Recommended Video

Screenplay Movie Public Talk | Vikram Shiva | Pragathi Yadhati
కోబ్రాతో బిజీ..

కోబ్రాతో బిజీ..

ఇకపోతే ప్రస్తుతం విక్రమ్ మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మణిరత్నం హిస్టారికల్ సినిమా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పాటు కోబ్రా అనే మరో ప్రయోగాత్మక సినిమాలో కూడా నటిస్తున్నాడు. కోబ్రా సినిమా అపరిచితుడు తరహాలో ఉంటుందని పది రకాల పాత్రలతో విక్రమ్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X