సూపర్ స్టార్ విక్రమ్ జీవితంలో విషాదం.. కొత్త సంవత్సరంలో..
తమిళ సూపర్‌స్టార్ విక్రమ్ జీవితంలో విషాదం చోటుచేసుకొన్నది. డిసెంబర్ 31 రాత్రి విక్రమ్ తండ్రి వినోద్ రాజ్ కన్నుమూశాడు. దీంతో విక్రమ్‌కు కొత్త సంవత్సరం తీరని దు:ఖం కలిగింది. తండ్రి వియోగం జరిగిన విక్రమ్‌ను దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. కొంతమంది స్వయంగా విక్రమ్‌ను కలిసి పరామర్శించారు.

విక్రమ్ తండ్రి
విక్రమ్ తండ్రి వినోద్ రాజ్ కన్నడ చిత్ర నటుడు. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. గతేడాది ఆయన నటింంచిన తిరుపాచి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.

వినోద్ రాజ్ గురించి
వినోద్ రాజ్‌కు సినీ నటుడు విక్రమ్‌తోపాటు మరో కుమారుడు అరవింద్, కూతురు అనిత ఉన్నారు. అరవింద్ దుబాయ్‌లో స్థిరపడగా, అనిత టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నది. భార్య రాజేశ్వరి ప్రముఖ నటుడు త్యాగరాజాన్‌కు సోదరి. ఆమె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు.

సినీ రంగ ప్రవేశం
వినోద్ రాజు తమిళనాడులోని పరమకుడికి చెందిన వాడు. 1988లో గలాట్టా కుదుంబమ్ అనే దూరదర్శన్ సీరియల్‌లో నటించడం ద్వారా నటజీవితం ప్రారంభించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఎన్ కాదల్ కన్మణి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు.

జాన్ విక్టర్‌గా సుపరిచితుడు
ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్ర రంగంలో గిల్లి లాంటి పలు చిత్రాల్లో నటించాడు. సినిమాల్లో జాన్ విక్టర్ అందరికీ సుపరిచితుడు. వృద్ధాప్య, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











