#Chiyaan60 కొడుకుతో కలిసి విక్రమ్ గ్యాంగ్‌స్టర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ ఎప్పుడంటే?
కరోనావైరస్ కారణంగా తమిళనాడులో థియేట్రికల్ రిలీజ్‌పై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితి సూపర్ స్టార్ చియాన్ విక్రమ్‌కు కూడా తప్పడం లేదు. తన కుమారుడు ధ్రువ్‌తో కలిసి నటించిన మహాన్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..

2016లో విక్రమ్‌కు కార్తీక్ సుబ్బరాజ్
మహాన్ చిత్రం విషయానికి వస్తే.. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. 2016లో తొలిసారి విక్రమ్‌కు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ చెప్పారు. ఆ సమయంలో విక్రమ్ ఇరు మగన్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. దాంతో ఆ సమయంలో ఈ సినిమా చేయడానికి కుదర్లేదు. ఆ తర్వాత 2020లో విక్రమ్, కార్తీక్ సుబ్బరాజ్ మూవీ ప్రారంభమైంది.

మరోసారి గ్యాంగ్‌స్టర్ సినిమాతో
మహాన్ చిత్ర కథ గురించిన వివరాల్లోకి వెళితే.. తండ్రి, కొడుకుల మధ్య సాగే ఓ ఎమోషనల్ స్టోరి. జెమినీ, భీమ చిత్రాల తర్వాత విక్రమ్ మరోసారి మాఫియా నేపథ్యం, గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటించడం గమనార్హం. అయితే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసం ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేయడం కష్టమని భావించిన నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

చియాన్ కెరీర్‌లో 60వ చిత్రంగా
విక్రమ్ కెరీర్‌లో మహాన్ చిత్రం ప్రత్యేకంగా నిలువబోతున్నది. తన కెరీర్‌లో 60వ చిత్రంగా తెరకెక్కడం ఓ విశేషం కాగా, సొంత కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి నటించడం మరో ప్రత్యేకతగా చోటు చేసుకొన్నది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత లలిత్ కుమార్ తెలిపారు. ఈ సినిమాను ఓటీటీలో ప్రదర్శించాలని తీసుకొన్న నిర్ణయం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. యాక్షన్, ఎమోషన్స్ కలబోతతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకొంటుంది అని లలిత్ కుమార్ తెలిపారు.

అమెజాన్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో
మహాన్ చిత్రం తమిళంతోపాటు, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. కన్నడలో ఈ సినిమా టైటిల్‌ను మహా పురుష అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత లలిత్ కుమార్ తెలిపారు. దీంతో చియాన్ అభిమానులు సంతోషంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Recommended Video

మహాన్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: విక్రమ్, ధ్రువ్ విక్రమ్, వాణి భోజన్, బాబీ సింహా, సిమ్రాన్, సనత్, దీపక్ పరమేష్ తదితరులు
రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
సినిమాటోగ్రఫి: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: వివేక్ హర్షన్
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియో
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2022-02-10


Click it and Unblock the Notifications











