సామి స్వ్కేర్ నా కెరీర్‌లోనే ఓ మైలురాయి.. చియాన్ విక్రమ్
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ త్వరలో విడుదల కాబోతున్న స్వామి స్క్వేర్‌పై భారీగా ఆశలు పెట్టుకొన్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఉద్వేగంగా మాట్లాడుతూ.. సామి స్క్వేర్ గురించి మాట్లాడితే ఎమోషనల్‌గా ఫీలవుతాను. ఈ ప్రాజెక్ట్‌లో చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి. సామి నా కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం. నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా సామి స్క్వేర్ రూపొందింది అని విక్రమ్ పేర్కొన్నారు.
దిల్, ధూల్, సామి మాదిరిగానే సామి స్క్వేర్ నా కెరీర్‌లోనే మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో నేను నటించిన ఆరుస్వామి అనే క్యారెక్టర్‌ను ప్రేక్షకుల చాలా ఇష్టపడుతారు అని విక్రమ్ చెప్పారు.

సామి స్క్వేర్ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నది. ఈ చిత్రంలో ఇద్దరు కలిసి ఓ పాటను కూడా పాడారు. ఈ సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.


Click it and Unblock the Notifications











